
క్రైమ్ మిర్రర్ (చేవెళ్ల )నవంబర్ 21: హైదరాబాద్ బీజాపూర్ 163 హైవేపై మరోసారి రోడ్డు ప్రమాదం జరిగింది ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి ఈ సంఘటనలో . పలువురికి గాయాలు అయ్యాయి. తాండూర్ ప్రాంతానికి చెందిన వంశీధర్ రెడ్డి S/o పాండురంగ రెడ్డి , వయస్సు 46 సం. దంత వైద్యుడు. తన కార్ కి ఆక్సిడెంట్ అయింది అని పోలీస్ వారికి పిర్యాదుచేయడం జరిగింది.
ఫిర్యాదుదారుడు తెలిపిన వివరాల ప్రకారం 21.11.2025 న ఉదయం 07:30 గంటలకు మోయినబాద్- కనక మామిడి మధ్యలో On the way Drive inn (పెంటయ్య హోటల్) దగ్గర హైదరాబాద్ నుండి చేవెళ్ల వెళ్తున్న కారు (TG07 T 1203), వేగంగా, నిర్లక్షముగా రాంగ్ రూట్ లో వచ్చి ఫిర్యాదుదారుని హోండా WR-V (TS08 FV 8288)ను ఢీకొట్టింది.

ప్రమాదంలో ఫిర్యాదుదారుని అత్తమ్మ సుజాత, బంధువు రోజా మరియు డ్రైవర్ వెంకట్ గాయపడ్డారు, వెంకట్ కి తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన వైద్యం మేరకు ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు. రాంగ్ రూట్ లో వచ్చిన వాహనం డ్రైవర్ ఖరీమ్ అక్కడికక్కడే మృతి చెందగా, అదే కారులో ఉన్న లోకేష్ చికిత్స పొందుతూ భాస్కర్ హాస్పిటల్ లో మృతి చెందాడు.
బాబు రావుకు తలకు, అఖిల్ కు చిన్న గాయాలు అయ్యాయి. పై విషయం లో పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు పోలీస్ వారు తెలిపారు.
ఈ మధ్యకాలంలో హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ప్రమాదాలు తరచూ జరుగుతున్నాయని స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

తాము ఇంటి నుండి బయలుదేరి తిరిగి ఇంటికి వచ్చేవరకు ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకొని ప్రయాణాలు చేయవలసి వస్తుందని తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ రోడ్డును పూర్తి చేయవలసిందిగా అధికారులను కోరుతున్నారు.





