
క్రైమ్ మిర్రర్,కర్నూల్ న్యూస్:- కర్నూలు జిల్లాలో నిన్న జరిగిన బస్సు ప్రమాదంలో దాదాపు 20 మంది కాలి బూడిద అయ్యారు. ఈ ఘటన యావత్ దేశం మొత్తం కూడా సంచలనం సృష్టించింది. కొద్ది క్షణాల్లోనే బస్సు మొత్తం మంటలు వ్యాపించడం ద్వారా బస్సులో ఉన్నటువంటి కొంతమంది ప్రాణాలతో బయటపడగా మిగిలిన వారందరూ బస్సులోనే అగ్నికి ఆహుతి అయ్యారు. అయితే తాజాగా ఈ ఘటనలో మరొక విషయం బయటకు వచ్చింది. బస్సు లగేజీ క్యాబిన్ లో దాదాపు 400 కు పైగా ఫోన్లతో ఉన్నటువంటి పార్సిల్ ఒకటి ఉన్నట్లుగా తాజాగా ఫోరెన్సిక్ టీం గుర్తించింది. బస్సులో మంటలు వ్యాపించిన తర్వాత వేడికి ఈ ఫోన్లో బ్యాటరీలు పేలడంతో ప్రమాద తీవ్రత మరింత పెరిగిందని ఈ ఫారెన్సీక్ టీం తెలిపింది. మరోవైపు డోర్ దగ్గర ఉన్నటువంటి చిన్న చిన్న హైడ్రాలిక్ సిలిండర్లు పేలిపోగా డోర్లు తెరుచుకోవడానికి వీలు కాలేదు అని అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ ఘటన డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగినట్లు తెలుస్తుంది. కాగా మరో వైపు బైక్ ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా మరణించడంతో రాష్ట్రవ్యాప్తంగా చాలామంది ఇళ్లలో కన్నీళ్లు మిగిలాయి. బస్సులో ఉన్న వారందరూ కూడా చాలా మంది యువతే కావడం కూడా అందరిని దుఃఖానికి గురిచేస్తుంది. దీపావళి పండుగకు ఇంటికి వచ్చి వెనుతిరిగి వెళుతున్నటువంటి కొంతమంది అగ్నికి ఆహుతి అవ్వడం వారి కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. మరోవైపు ఈ ఘటనలో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్రం నుంచి ఎక్గ్రేషియాలు ప్రకటించారు. గాయపడిన వారికి రెండు లక్షల నష్టపరిహారం ఇవ్వనున్నారు.
Read also :AI పై జగన్ చేసిన వ్యాఖ్యలపై ట్రోల్స్ చేస్తున్న టీడీపీ ఫాలోవర్స్
Read also : పేరెంట్స్ అనుమతిస్తే… కచ్చితంగా లవ్ మ్యారేజ్ చేసుకుంటా : అనుపమ





