
Telangana political party : తెలంగాణలో కొత్త పార్టీ రాబోంది. అది కూడా బీసీల పార్టీ. పెట్టబోయేది ఎవరో తెలుసా… తీన్మార్ మల్లన్న. బీసీల పార్టీ పెట్టి తీరుతామని… అగ్రవర్ణ పార్టీలను తరమికొడతామని.. అలా చేయకపోతే తన పేరు తీన్మార్ మల్లన్నే కాదని సవాల్ కూడా చేశారు. కొత్త పార్టీ ప్రటించిన ఆయన… ఎప్పుడు ఆవిర్భవించబోతున్నారు. ఆ కొత్త పార్టీకి జెండా.. అజెండాలు ఏంటి..?
తెలంగాణలో ప్రధానంగా మూడు పార్టీలు ఉన్నాయి. ఒకటి బీఆర్‌ఎస్… ఉద్యమ పార్టీ. పదేళ్లు అధికారంలో ఉన్న పార్టీ. రెండోది జాతీయ పార్టీ. పదేళ్ల తర్వాత అధికారం చేపట్టిన పార్టీ. మూడో పార్టీ బీజేపీ. నెక్ట్స్ అధికారం తమదే అని కలలు గంటున్న పార్టీ. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా… ఏ రాజకీయమైనా.. ఈ పార్టీల మధ్యే. ఇక… టీడీపీ, కమ్యూనిస్ట్ వంటి పార్టీలు ఏదో ఉన్నామంటే ఉన్నాం అన్నట్టుగా ఉన్నాయి తెలంగాణలో. ఈ క్రమంలో.. కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు… కాంగ్రెస్ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్సీ చింతపండు నవీన్‌కుమార్. ఆయనే తీర్మాన్ మల్లన్న. బీసీల పార్టీ పెట్టబోతున్నట్టు మంచిర్యాలలో జరిగిన బీసీ రాజ్యాధికార సభలో స్పష్టంగా చెప్పాడు.
తెలంగాణలో బీసీ రాజకీయం జోరుగా జరుగుతోంది. 42శాతం బీసీ రిజర్వేషన్ అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లును తీర్మానించి కేంద్రానికి పంపింది. ఆ బిల్లును ఆమోదింపజేసుకునేందుకు… ఢిల్లీ వీధుల్లో ధర్నా కూడా చేసొచ్చింది. కాంగ్రెస్ సర్కార్ పదే పదే బీసీ మంత్రం జపిస్తుండటంతో.. బీఆర్‌ఎస్ కూడా ఆ రూట్‌లోకే వచ్చేసింది. బీసీ మంత్రి జపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం… ఉపరాష్ట్రపతి పదవిని బీసీ నాయకుడికి ఎందుకు ఇవ్వలేదని మాజీ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. బీజేపీ కూడా రెండు పార్టీలకు కౌంటర్ అటాక్ ఇస్తూనే ఉంది. ఇప్పుడు.. ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న కూడా యాడ్ అయ్యాడు. బీసీల కోసం పార్టీ పెడుతున్నట్టు ప్రకటించాడు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ దొరల పార్టీలని… బీసీలకు న్యాయం చేయరని విమర్శించారు. ఆ పార్టీల్లో అగ్రకులాల వారికే పదవులు దక్కుతాయని అన్నారు. పదవుల కోసం వారిని అడగాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. బీసీల కోసం పార్టీ పెడుతున్నానని… త్వరలోనే బీసీలకు ఒక గుర్తింపు రాబోతుందని చెప్పారు తీర్మాన్ మల్లన్న. అప్పుడు బీసీ ఓట్లు బీసీ నాయకులే పడతాయన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల చేయిపట్టుకుని… తెలంగాణలో బీసీలు అధికారంలోకి రాబోతున్నారని చెప్పారు.
తెలంగాణ బీసీలు ఎక్కుడా… అందులో ముదిరాజులే ఎక్కువ. అందుకే… ముదిరాజులే బీసీ ఉద్యమానికి పెద్దన్నపాత్ర వహించాలని అన్నాడు తీర్మాన్ మల్లన్న. బీసీలకు 42 శాతం కాదు.. 60శాతం రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. మంత్రివర్గంలో కూడా బీసీలకు 9 పదవులు కావాలన్నాడు. బీసీల తెలంగాణ సాధించుకుంటామని.. అందుకోసం ఉద్యమం చేస్తామన్నారు. మరి.. ఈ ఉద్యమం ఎగిసిపడుతుందా…? రాబోయే బీసీ పార్టీ తెలంగాణ రాజకీయాలను మలపు తిప్పుతుందా…? అసలు.. బీసీలు… తీర్మాన్ మల్లన్నకు సహకరిస్తారా…? ఆయన మాటలు… వారిపై ఎంతమేర ప్రభావం చూపుతాయి…? రాబోయే రోజుల్లో వీటిపై క్లారిటీ వస్తుంది.