
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- మన టాలీవుడ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస సినిమాలతో దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాలో నటిస్తుండగా.. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ముగిసే అవకాశం ఉంది. అయితే ఆ వెంటనే లేట్ చేయకుండా అల్లు అర్జున్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మరో సినిమా తీస్తున్నట్లుగా ఫిలింనగర్ లో గట్టిగానే టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ సినిమాలో బిజీగా ఉండగా మరోవైపు బోయపాటి శ్రీను అఖండ -2 సినిమాతో అంతకుమించి బిజీగా ఉన్నారు. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను చేస్తున్నటువంటి రెండు సినిమాలు కూడా షూటింగ్ ను పూర్తి చేసుకునే దశకు వచ్చాయి. ఈ సందర్భంలోనే అల్లు అర్జున్ అలాగే బోయపాటి శ్రీను ఇద్దరు కూడా కలిసి ఒక సినిమా చేయబోతున్నారు అని సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటికే అల్లు అర్జున్ డైరెక్టర్ బోయపాటితో చర్చలు కూడా జరిపారు అని వార్తలు వస్తున్నాయి. కాగా వీరిద్దరి కాంబోలో గతంలో సరైనోడు సినిమా ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తే పక్కాగా మాస్ కాంబినేషన్ లో అల్లు అర్జున్ ఇరగదీస్తారు అని బన్నీ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇప్పటికే పుష్ప సినిమాతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. ప్రస్తుతం అట్లీతో మరో సెన్సేషనల్ మూవీ తో ముందుకు రానున్నారు. మరి ఈ సినిమా గురించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పటికే చాలా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది అని ఇప్పటికీ కొంతమంది సినిమా విశ్లేషకులు అంటున్నారు.
Read also : Royal Enfield: ఓర్నీ.. 1986లో రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర ఇంత తక్కువా?
Read also : VIRAL VIDEO: పిల్లాడు మొబైల్ ఎక్కువగా చూస్తున్నాడని తల్లి ఏం చేసిందంటే..





