
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే గత రెండు రోజుల నుంచి ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే తాజాగా వాతావరణ శాఖ అధికారులు మరొక చేదు విషయాన్నీ వెల్లడించారు. బంగాళాఖాతంలో ఈరోజు మరొక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని… ఈ ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని APSDMA కీలక ప్రకటన చేసింది.
నేడు వర్షాలు కురిసే జిల్లాలు
1. కోనసీమ
2. కృష్ణ
3. గుంటూరు
4. బాపట్ల
5. ప్రకాశము
6. నెల్లూరు
7. నంద్యాల
పైన పేర్కొన్న ఈ ఏడు జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. కోస్తా తీరం వెంబడి 35 – 55 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. కాబట్టి ఈదురు గాలులతో కూడుకున్న వర్షాలు నేడు పెద్ద ఎత్తున కురుస్తాయని.. మత్స్యకారులు వేటకు వెల్లకూడదని అధికారులు హెచ్చరించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ భారీ వర్షాలు నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు పలు జిల్లాలకు NDRF మరియు SDRF బృందాలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ లోతట్టు ప్రాంతాలపై ఒక కన్నేసి ఉంచారు. ఈదురు గాలులతో కూడినటువంటి వర్షాలు పడే అవకాశాలు ఉండడంతో ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, దూరపు ప్రయాణాలు రద్దు చేసుకోవాలని సూచించారు. కాగా ఈ నెల చివర ఆఖరిలోపు వర్షాలుతో గుమకం పట్టే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే చెప్పిన విషయం అందరికీ తెలిసిందే.మరోవైపు వర్షాల నేపథ్యంలో పలు జిల్లాల స్కూల్స్ కు సెలవలు ప్రకటించారు.
Read also : కోర్టు తీర్పు వెల్లడించిన తరువాతే ఎన్నికలపై ఒక నిర్ణయం తీసుకుంటాం : మంత్రి పొంగులేటి





