
క్రైమ్ మిర్రిర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణలో మరో పరువు హత్య జరిగింది. తన కూతురిని ప్రేమించాడని యువకుడిని గొడ్డలితో తండ్రి కిరాతకంగా నరికి చంపాడు. ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామంలో చోటు చేసుకుంది.మృతుడి కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందిన పూరెల్ల సాయికుమార్ అదే గ్రామానికి చెందిన యువతితో ప్రేమలో ఉన్నాడు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో యువతి తండ్రి ప్రేమకు అడ్డు చెప్పాడు. ఇకనుంచి అమ్మాయితో మాట్లాడవద్దని సాయికుమార్ ను హెచ్చరించాడు. కానీ అమ్మాయి… అబ్బాయి ఇద్దరూ మాట్లాడుకుంటూనే ఉండడంతో యువతి తండ్రి ఆగ్రహంతో రగిలిపోయాడు.
ఈ క్రమంలోనే గురువారం రాత్రి పది గంటల సమయంలో సాయికుమార్ తన స్నేహితులతో మాట్లాడుతుండగా అదే సమయంలో అమ్మాయి తండ్రి గొడ్డలితో అక్కడికి చేరుకున్నాడు. అనంతరం ఒక్క సారిగా సాయికుమార్ పై గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేయడంతో సాయికుమార్ కు తీవ్ర గాయాలయ్యాయి.రక్తపు మడుగులో పడి ఉన్న సాయికుమార్ ను అతని స్నేహితులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన సుల్తానాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా వైద్యం అందిస్తుండగానే సాయికుమార్ మృతి చెందాడు. కాగా సాయికుమార్ పుట్టినరోజు నాడే హత్యకు గురికావడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
టియుడబ్ల్యూజే అధ్యక్షుడు రాపోలు ప్రభాకర్ కు ఘన సన్మానం
అభివృద్ధికి ఎల్లప్పుడు ముందుంట… పాఠశాల తరగతి గది నిర్మాణానికి తనవంతు సాయం