
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- టాలీవుడ్ లోని కొంతమంది కమెడియన్ల పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. ఎన్నో తెలుగు సినిమాల్లో నటించి.. తెలుగు ప్రేక్షకులను నవ్వించిన కొంతమంది ఆర్టిస్టులు నేడు అనారోగ్య సమస్యలతో లేదా ఆర్థిక సమస్యలతో ఉన్నారు. ఈ మధ్యనే కమెడియన్ ఫిష్ వెంకట్ కిడ్నీ సమస్యల వ్యాధితో అనారోగ్య కారణంగా మరణించారు. అతనికి కనీసం చికిత్సకు కావలసినంత డబ్బు కూడా లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీ నుండి డబ్బులు సహాయం చేయాలని అతని ఫ్యామిలీ కోరింది. మొదటగా ఎవరు హెల్ప్ చేయకపోగా.. తరువాత చిన్న చిన్న నటులతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. కానీ చివరికి కిడ్నీ డొనేట్ చేసేవారు దొరకకపోవడంతో.. కమెడియన్ ఫిష్ వెంకట్ మరణించారు.
Read also : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాకు Z సెక్యూరిటీ.. దాడే కారణం!
అయితే నేడు మరో కమెడియన్ దీనమైన అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నారు. అతను ఎవరో కాదు.. వెంకీ సినిమాలో రవితేజ పక్కన నటించినటువంటి రామచంద్ర అనే ఒక ఆర్టిస్ట్. వెంకీ సినిమాలో వీరభద్రంగా నటించినటువంటి రామచంద్రా అనే ఆర్టిస్ట్ నేడు అనారోగ్య పరిస్థితుల కారణంగా మంచం పట్టారు. దాదాపు కొద్ది రోజుల క్రితమే అతను పక్షవాతానికి గురవడంతో ప్రస్తుతం ఆయన పరిస్థితి చాలా దీనస్థితిలో ఉంది. బ్రెయిన్ లో రక్తం గడ్డ కట్టడంతో ఎడమ చేయి అలాగే ఎడమ కాలు పనిచేయడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. రామచంద్ర తాజాగా డీజె టిల్లు, సార్ వంటి కొన్ని చిత్రాల్లో చిన్న పాత్రలు పోషించారు. అలాగే అప్పటి కాలంలో ఆనందం, గౌతమ్ SSC, సొంతం వంటి సినిమాల్లో తనదైన కామెడీతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నారు. మరి ఈ కమెడియన్ అయినా త్వరగా కోలుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిందే.
Read also : భారత్ తో విభేదాలు అమెరికాకు నష్టమే, నిక్కీహేలీ షాకింగ్ కామెంట్స్!