
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- ప్రముఖ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ పై తాజాగా మరో కేసు నమోదు అయింది. ప్రతిరోజు సోషల్ మీడియాలో ఏదో ఒక విషయం పై కాంట్రవర్సీ కామెంట్లు చేసే రాంగోపాల్ వర్మ.. తాజాగా హిందూ దేవుళ్ళు, భారత ఆర్మీ, ఆంధ్రులను ఒక ఇంటర్వ్యూలో ఘోరంగా అవమానించారంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మేడా శ్రీనివాసరావు తీవ్రంగా మండిపడ్డారు. రాంగోపాల్ వర్మపై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీంతో వరుసగా రాంగోపాల్ వర్మ పై కేసులు నమోదు అవుతూనే వస్తున్నాయి. రాంగోపాల్ వర్మతో పాటుగా అతనిని ఇంటర్వ్యూ చేసినటువంటి యాంకర్ స్వప్న పైన కూడా కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరారు. మేడా శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు రాజమండ్రి 3 టౌన్ పోలీసులు క్రైమ్ నెంబర్ 487/2025 కింద కేసు నమోదు చేశారు. ప్రతిరోజు కాంట్రవర్సీలలో నిలిచేటువంటి రాంగోపాల్ వర్మ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్. కానీ ఆ తర్వాత నుంచి ఏదో ఒక విషయంలో ఇతరుల మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడడం వంటివి చేస్తూ పలుసార్లు జైలుకు వెళ్లారు. ఏదో ఒక సందర్భంలో ఆర్జీవి పై కేసులు నమోదు అవుతూనే వస్తున్నాయి. అయినా కూడా రాంగోపాల్ వర్మ ఎక్కడ వెనక్కి తగ్గట్లేదు. గతంలో ఒంగోలులో కూడా కేసులను మోదవడంతో ప్రతి శుక్రవారం పోలీస్ స్టేషన్కు వెళ్లి సంతకం పెట్టి వచ్చిన ఘటనలు కూడా చూసే ఉన్నాం.
Read also : ఎవరికి వారే యమునా తీరే… విరుద్ధంగా ఇరు పార్టీలు నినాదాలు
Read also : గుడికి వెళ్తున్నారా.. అయితే ఇది తప్పకుండా పాటించండి..!