
క్రైమ్ మిర్రర్, వెబ్ డెస్క్:- జీ7 దేశాలు పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించాయి. అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. పాకిస్తాన్ తీరును తప్పుబట్టాయి.జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి కారణంగా పాకిస్తాన్ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. భారత్ యుద్ధం ప్రకటించటంతో పాక్ చుక్కలు చూస్తోంది. పాకిస్తాన్ పరిస్థితి చూసి ఏ దేశం కూడా జాలి తలచటం లేదు. అగ్రరాజ్యం అమెరికా తాము యుద్ధం మధ్యలో కలుగజేసుకోమంటూ స్పష్టం చేసింది. ఇలా అన్ని రకాలుగా దెబ్బ తింటున్న పాక్‌కు మరో షాక్ తగిలింది. జీ7 దేశాలు ఊహించని దెబ్బ కొట్టాయి. పహల్గామ్ ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు అమెరికా, కెనడా, జపాన్, ఫ్రాన్స్, జర్మన్, ఇటలీ దేశాలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.
ఏప్రిల్ 22 విషాదం..
2025, ఏప్రిల్ 22.. పాకిస్తాన్ వినాశనానికి కారణమైన రోజు. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు జమ్మూకాశ్మీర్, పహల్గామ్‌లోని బైసరన్ లోయలో పర్యాటకులపై ఉగ్రదాడికి పాల్పడ్డారు. పర్యాటకుల మతం తెలుసుకుని మరీ కాల్చేశారు. మొత్తం 26 మంది అమాయక పర్యాటకుల ప్రాణాలు తీసేశారు. దీంతో భారత్ ముందెన్నడూ ఊహించని విధంగా నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేయించింది. ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. పాకిస్తాన్ తుక్కురేపుతోంది