
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో దారుణం చోటుచేసుకుంది. గుర్తు తెలియని ఒక వ్యక్తి చేతిలో.. తల్లి అలాగే తన ఇద్దరు కూతుర్లు బలైపోయారు. ఈ విషయం తాజాగా తెలుగు రాష్ట్రంలో సంచలనం రేపుతుంది. ఇక వివరాల్లోకి వెళితే… ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కాకినాడ జిల్లా సామర్లకోటలో ఈ దారుణ ఘటన జరిగింది. ఒకే ఇంట్లో తల్లి మరియు ఇద్దరు కుమార్తెలు దారుణ హత్యకు గురవడంతో ఆ కాలనీ మొత్తం కూడా షాకు కు గురైంది. సామర్లకోట మండలంలోని సీతారామ కాలనీకి చెందిన ములపత్తి మాధురి కి జెస్సి లోన (8), పుష్ప కుమారి (6) అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. వీరంతా ఇంట్లో నిద్రపోతున్న సమయంలో ఎవరు గుర్తు తెలియని వ్యక్తులు బలమైన ఆయుధాలతో కొట్టి చంపేశారు.
Read aslo : గుండాల మండలంలో ఇద్దరు పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్ చేసిన జిల్లా కలెక్టర్
ఇక ఈ ఘటన రాష్ట్రమంతా కూడా సంచలనగా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. కానీ ఈ హత్యకు సంబంధించి కారణాలు ఇంకా తెలియలేదు. ఎవరు చేశారు?.. అనేది పోలీసులు తెలిపే ప్రయత్నంలో నిమిత్తమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి త్వరలోనే అసలు వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. కాగా ఈమధ్య రెండు తెలుగు రాష్ట్రాలలో హత్యలు అనేవి విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో సిటీలతో పాటు గ్రామాలు,బహిరంగ ప్రదేశాలలోనూ, మామూలు ప్రదేశాలలోను కూడా సీసీ కెమెరాలు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. నిత్యం అన్ని ప్రదేశాల్లోనూ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు.
Read also : ‘ఆటంబాంబు’ పేల్చండి.. రాహుల్‌కు రాజ్‌నాథ్ సవాల్!