
Annapurna : సనాతన ధర్మ ప్రచార సమితి ఆధ్వర్యంలో శుక్రవారం అమావాస్య సందర్భంగా నిర్వహించిన “అన్నపూర్ణ అమావాస్య అన్నప్రసాద సేవ” భక్తి పూర్వకంగా, విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం గోపూజ, అన్నపూర్ణ దేవి పూజతో ప్రారంభమై, అనంతరం జరిగిన అన్నసంతర్పణలో పట్టణం నలుమూలల నుండి వచ్చిన భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. శృంగేరి శారదా పీఠ ఆస్థాన పౌరాణికులు బ్రహ్మశ్రీ డాక్టర్ గర్రెపల్లి మహేశ్వర్ శర్మ ఆధ్వర్యంలో, స్థానిక అర్చకులు భానుమూర్తి, దివాకర్ శర్మ వేదోక్త పూజలు నిర్వహించారు.
ఈ సేవా కార్యక్రమంలో సుమారు 1,200 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి పుణ్యఫలాన్ని పొందారు. సనాతన ధర్మ ప్రచార సమితి నిర్వాహకులు మాట్లాడుతూ – “భారత సనాతన సంప్రదాయంలో పితృదేవతల సంతృప్తి, సమాజంలో భక్తి భావం పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలను ప్రతి అమావాస్య రోజు కొనసాగిస్తాం. భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో అన్నప్రసాద సేవలను విస్తరించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం” అని తెలిపారు.
ఈ సేవ విజయవంతం కావడానికి సహకరించిన దాతలు, సభ్యులు, భక్తులు, సేవకులందరికీ నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సమితి అధ్యక్ష కార్యదర్శులు మంచాల జగన్, బట్టు హరికృష్ణ, అన్నప్రసాద సేవ చైర్మన్ వనపర్తి చంద్రమోహన్, కన్వీనర్ గంప శివకుమార్, నిర్వాహకులు మంచాల రమేష్, వొటారి చిన్నరాజన్న, అందె శివ ప్రసాద్, పల్లెర్ల మహేందర్, కంటం సదాశివ్, మంచాల రాజలింగం, శ్రీపతి రమేష్, కట్కం రంజిత్, సాడిగె మహేష్, కొండబత్తిని అనంత కృష్ణప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.