ఆంధ్ర ప్రదేశ్

పవన్, లోకేష్ అన్నలు దండం పెడతా.. శ్రీరెడ్డి బహిరంగ లేఖ

వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుగా గతంలో రెచ్చిపోయిన శ్రీరెడ్డి మరోసారి సారీల పర్వం సాగించారు. లోకేష్ అన్నా… కాస్త జాలి చూపన్నా అంటూ ప్రాధేయ పడ్డారు. మొన్న సారీలు చెబుతూ.. వీడియో విడుదల చేసిన శ్రీ రెడ్డి ఈసారి లేఖను తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేశారు. మొన్నటి వరకు శ్రీ రెడ్డి పలుమార్లు ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ను ఉద్దేశించి తీవ్ర స్థాయిలో వ్యక్తిగతంగా కూడా విమర్శించారు. కానీ మొన్న ఒక్కసారిగా ఉన్నట్లుండి అందరికీ క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను విడుదల చేశారు శ్రీరెడ్డి. తాజాగా మరో లేఖను కూడా విడుదల చేసి, వైసీపీ కి గుడ్ బై చెప్పేశారు.

మంత్రి నారా లోకేష్ కు సైతం అన్నా అంటూ సంబోధిస్తూ తన ఇష్టమైన దైవం పై ప్రమాణం చేసి చెబుతున్నానని, ఇక ఎప్పుడూ ఇబ్బంది కలిగించే రీతిలో వివాదాస్పద కామెంట్స్ చేయనంటూ మరో మారు సారీల పర్వం సాగించారు. గత వారం రోజులుగా ఆహారం, నిద్ర లేకుండా బాధతో కుమిలిపోతున్నట్లు, తనతో పాటు తన కుటుంబ సభ్యులు అనుభవించిన క్షోభ వేల సంవత్సరాలకు సరిపడా అనుభవించినట్లు, ఇప్పటికైనా తమను వదిలివేయాలని కోరారు.

ఇటీవల సారీ చెబుతూ వీడియో విడుదల చేయడం వెనక తాను ఎంతో ఆవేదనకు గురైనట్లు, ఇంకా ఎవరి పేరునైనా మరిచిపోయి ఉంటే వారందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు చెబుతున్నట్లు కోరారు. చివరగా వైఎస్ షర్మిళ, సునీతలకు కూడా మీరు కూడా క్షమాపణలు స్వీకరించండి అంటూ కోరుతూ.. సినిమాలపరంగా తాను ఫెయిల్ అయ్యానని, అలాగే పాలిటిక్స్ పరంగా కూడా తాను ఫెయిల్ అయినట్లు శ్రీరెడ్డి లేఖలో పేర్కొన్నారు.
ఈసారి లేఖలో కొత్త పేర్లను చేర్చారు శ్రీరెడ్డి. మొన్న వీడియోలో చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్, పవన్ కళ్యాణ్ తల్లికి సారీ చెప్పిన శ్రీరెడ్డి, ఈసారి చిరంజీవి, నాగబాబు, వైఎస్ షర్మిళ, వైఎస్ సునీత పేర్లను కూడా చేర్చారు.

మరోవైపు సినీనటి శ్రీరెడ్డిపై కృష్ణా జిల్లా గుడివాడ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డీప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, హోం మంత్రి అనితలపై అసభ్యకర రీతిలో పోస్టులు పెట్టారంటూ.. మచిలీపట్నం టీడీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ నిర్మల ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గుడివాడ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ.. రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి.. అనకాపల్లి పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, అనితలపై ఆమె ప్రవర్తించిన తీరు జుగుప్సాకరంగా ఉందంటూ.. సీఐకి ఫిర్యాదు పత్రం అందజేశారు. ఇప్పటికే శ్రీరెడ్డిపై తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణంలో కేసు నమోదైంది.

మరిన్ని వార్తలు చదవండి .. 

నయీం ఇంటికి వెళ్లిన మంత్రి పొన్నం ప్రభాకర్

మహిళలకు అర్దరాత్రి పోలీసుల వేధింపులు..రేవంత్‌కు పుట్టగతులుండవ్!

కేటీఆర్.. నీ బొక్కలు ఇరుగుతయ్.. పీసీసీ చీఫ్ వార్నింగ్

కేటీఆర్ ఇంటి దగ్గర అర్ధరాత్రి టెన్షన్

ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఒరిజినల్ కాంగ్రెస్ నేత అర్ధనగ్న ప్రదర్శన

తిరుమలలో భారీ వర్షం.. భక్తులకు తీవ్ర ఇబ్బందులు

ఢిల్లీలో కాళ్లు మొక్కుతున్న కేటీఆర్! పొంగులేటి దగ్గర పక్కా ఆధారాలు.

కొడంగల్ అధికారిపై దాడి.. 300 మంది రైతులు అరెస్ట్

సమగ్ర సర్వే సిబ్బంది పైకి కుక్కలు..వణికిపోతున్న టీచర్లు

ఔలా గాళ్ల సంఘం అధ్యక్షుడిగా కేటీఆర్!

రైతులకు గండం.. వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు

రేవంత్ కంటే కేసీఆర్ చాలా నయం.. బండి సంజయ్ సంచలన కామెంట్స్

త్వరలో జనంలోకి కేసీఆర్.. ఆ సెంటర్ నుంచే రేవంత్ పై శంఖారావం!

ముగ్గురు విదేశాల్లో.. ముగ్గురు మహారాష్ట్రలో.. తెలంగాణలో దిక్కులేని మంత్రులు!

రేవంత్ యాత్రకు రాజగోపాల్ రెడ్డి డుమ్మా.. వెంకట్ రెడ్డే కారణమా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button