ప్రజా ప్రభుత్వంలో ఎక్కువైన కష్టాలు…
వడ్డికి పావుసేరుకు కొంటున్న దళారులు
రైతులపై చిన్న చూపు ఇంకెన్నాళ్లు…!
నిజామాబాద్, క్రైమ్ మిర్రర్:మనిషి ఆహారం లేకుంటే మనుగడ సాధ్యం కాదు.కాని ఆహారానికి అవసరమైన పంటలు పండించే రైతుకు మాత్రం కష్టాలు తప్పవు. దేశానికి రైతే వెన్నుముఖ అంటారు మీటింగ్‌లలో సభల్లో కాని ప్రత్యక్షంగా అది సాధ్యం కావడం లేదు. రైతుఅనే పదం ప్రసంగాలకే పరిమితమవుతుంది తప్ప ఆచరణలో వారిని చిన్న చూపే ఎదురవుతుంది. ఆరుగాలం ఎండనక, వానకగా సాగు చేసి పండించిన పంటకు కొనుగోలు కేంద్రాలు లేక చేసిన అప్పులకు వడ్డీలు పెరిగి రైతన్న తీవ్ర నిరాశ నిస్పృహలోకి వెళ్తున్నాడు.
నిజామాబాద్ జిల్లాలో శనగ, మక్క పండించిన రైతులకు నిరాశ ఎదురవుతుంది. పంటలు పండించిన కొనుగోలు చేయడం లేదని ఆవేదన చెందుతున్నారు. సకాలంలో ప్రభుత్వ యంత్రాంగం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయివేటు వ్యక్తులకు ధాన్యాన్ని వడ్డీకి పావుషేరుకు విక్రయించాలని ఆందోళన చెందుతున్నారు. శనగ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై ఉన్నతాధికారులకు నివేదికను అందజేశామని మార్క్‌ఫెడ్ డీఎం శశిధర్ అన్నారు. ఎన్‌సీసీ వారి నుంచి అనుమతులు రాగానే కేంద్రాలు ఏర్పాటు చేసి శనగలు కొనుగోలు చేస్తామని చెప్పారు.
నిరాశలో రైతులు…
ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే మద్దతు ధర రూ.5,875 లభిస్తుందనే ఆశతో ఎదురుచూస్తున్న రైతులకు నిరాశ తప్పడంలేదు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో గత్యంతరం లేక పెట్టుబడి కోసం తెచ్చిన అప్ప్పులు, కుటుంబ అవసరాల కోసం దళారులకు రూ.4,900 నుంచి రూ.5,300 వరకు విక్రయించి నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనగ పంట సాగు చేయడానికి పెట్టుబడి ఖర్చు ఎక్కువ కావడం, వాతావరణ పరిస్థితులు అనుకూలించక పోవడంతో దిగుబడి తక్కువగా వచ్చి సుమారు ఎకరానికి రూ.5,600 ఖర్చయినట్లు రైతులు చెబుతున్నారు. ప్రభుత్వ మద్దతు ధర లేక నష్టపోతున్నామని వాపోతున్నారు.
కాంగ్రెస్ పరిపాలనలో దళారీలదే రాజ్యం…
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరుపట్టించుకోక దళారీల రాజ్యం నడుస్తుంది. తక్కువ ధరకే అమ్మి రైతులు నష్టపోతున్నారు. పంట కోతకు వచ్చే సమయంలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తేనే రైతులు పంటలు అమ్ముకోగలరని అంటున్నారు. దీంతో రైతులకు శనగ విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తదు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ప్రయివేటు వ్యాపారులు రాజ్యమేలుతున్నారు.
రైతులు నిల్వ సౌకర్యం లేక, చేసిన అప్ప్పుల ఒత్తిడితో పంటను అమ్ముకోవాల్సి వస్తున్నది. రైతుల అవసరాలను ఆసరాగా తీసుకుని దళారులు తక్కువ ధరకే శనగలు కొనుగోలు చేసి, సరిహద్దులో ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ ఎక్కువ ధరకు విక్రయించి లాభాలు గడిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి శనగ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
