
బాలాపూర్ (క్రైమ్ మిర్రర్) : టియూడబ్ల్యూజే (ఐజేయూ) రంగారెడ్డి జిల్లా సంయుక్త కార్యదర్శిగా బొల్లంపల్లి ఆంజనేయులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహేశ్వరం నియోజకవర్గం ప్రజాతంత్ర దిన పత్రిక రిపోర్టర్ గా ప్రస్తుతం పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా ఆంజనేయులు మాట్లాడుతూ దాదాపు 2008 నుంచి ప్రజా శక్తి, ఈనాడు, ఆంధ్రభూమి వంటి వివిధ పత్రికలో పనిచేస్తున్న నాటి నుండి టియూడబ్ల్యూజే సంఘంలో సభ్యత్వం తీసుకొని, క్రియాశీలకంగా పని చేస్తున్నట్లు చెప్పారు. దీర్ఘకాలంగా పని చేస్తున్న కారణంగా సంఘం పెద్దలు గుర్తించి నాకు రంగారెడ్డి జిల్లా
టియూడబ్ల్యూజే సంయుక్త కార్యదర్శిగా అవకాశం కల్పించినట్లు చెప్పారు. ఈ అవకాశం కల్పించిన రాష్ట్ర కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా మాజీ అధ్యక్షులు కే.శ్రీకాంత్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు సలీం పాషా, ప్రధాన కార్యదర్శి మేకల సత్యనారాయణతో పాటు అందుకు పూర్తి సహాయ సహకారాలు అందించిన రంగారెడ్డి జిల్లా జర్నలిస్టు యూనియన్ మాజీ అధ్యక్షుడు ఆనంతుల శ్రీనివాస్ కు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్ర నాయకత్వం సూచనలు, సలహాలు, ఆదేశాల మేరకు జర్నలిస్టుల సమస్యలపై రాజీ లేని పోరాటం చేస్తానని హామీ ఇస్తున్నట్లు చెప్పారు.