
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఏపీలోని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ క్యాంప్ ఆఫీస్ వద్ద మళ్లీ టెన్షన్ వాతావరణం నెలకొంది. ఈమధ్య ఎన్టీఆర్ పై ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినటువంటి ఆడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అయితే వెంటనే ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని ఎన్టీఆర్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ వద్దకు చేరుకొని ఆఫీసు ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు పెట్టినటువంటి ఆంక్షలను పట్టించుకోకుండా… పోలీసులను కూడా నెట్టుకుంటూ ఎన్టీఆర్ అభిమానులు క్యాంప్ ఆఫీస్ చుట్టూ బైఠాయించారు. అక్కడే నుంచుని ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. తక్షణమే మళ్లీ జూనియర్ ఎన్టీఆర్ కు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
Read also : అమరావతి పై వైసీపీ ఫేక్ ప్రచారం.. తీవ్రంగా మండిపడ్డ సీఎం!
అయితే ఈ విషయంపై తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ నుంచి వివరణ తీసుకున్నారు. ఎవరిని ఇబ్బంది పెట్టకుండా, పద్ధతి మార్చు కోవాలని, సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు సూచించారు. తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణ తప్పితే ఎవరికైనా చర్యలు తప్పవని ఎమ్మెల్యేను ఉద్దేశించి హెచ్చరించారు. కాగా మరోవైపు ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ జూనియర్ ఎన్టీఆర్ ను నేను దూషించలేదని… ఈ విషయంలో నన్ను కావాలనే ఎవరో ఇరికించారని చెప్పుకొస్తున్నారు. ఎన్టీఆర్ ఫ్యామిలీ అంటే నాకు చాలా అభిమానం అని… అలాంటప్పుడు వారిని నేను ఎందుకు దూషిస్తానని… ఎన్టీఆర్ అభిమానులు బాధపడి ఉంటే నన్ను తప్పక క్షమించాలి అని ఎమ్మెల్యే ఒక వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయినా కూడా ఎన్టీఆర్ అభిమానులు ఈ విషయంపై ఇంకా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణం ఏం జరుగుతుందో అని… పోలీసులు నిరంతరం ఎమ్మెల్యే దగ్గుబాటి ఇంటి వద్ద మరియు ఆఫీస్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also : పలుగురాళ్లతో కోట్లకు పడగలు