తెలంగాణ

అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ 3వ మహాసభలు

గండిపేట్‌, క్రైమ్ మిర్రర్‌:- రంగారెడ్డి జిల్లా తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ మూడవ మహాసభలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రీ ప్రైమరీ పీఎం శ్రీ విద్యాను అంగన్‌వాడీ కేంద్రాల్లోనే నిర్వహించాలని, పోషన్‌ ట్రాకర్‌ యాప్‌లో ఎప్‌ఆర్‌ఎస్‌ విధానిన్న రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. మంచిరేవుల ఎక్స్‌రోడ్‌ డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఈ మహాసభ ప్రాంగణంలో సిఐటీయూ జెండా సీనియర్‌ అంగన్‌వాడీ టీచర్స్‌ యూనియన్‌ నాయకురాలు సులోచన జెండా ఆవిష్కరించారు. అనంతరం ఈ సభ రాజ్యలక్ష్మి అధ్యక్షతన నిర్వహించారు. తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సీఐటీయూ రంగారెడ్డి జిల్లా ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా మూడో మహాసభలు నిర్వహించడం జరిగిందన్నారు. దీనికి ముఖ్యఅతిథిగా సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు భూపాల్‌ హాజరై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఐసిడిఎస్ తో పాటు విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం కోసం నూతన జాతీయ విధాన విద్యా విధానo చట్టాన్ని తెచ్చిందన్నారు. ప్రమాదకరమైన విధానాలకు వ్యతిరేకంగా నిలబడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వం సిఫార్సులను అమలు చేస్తుందని, ఐసిడిఎస్ ను నిర్వీర్యం పరచడానికి నిర్ణయం చేయడం అత్యంత దుర్మార్గకరమని, ప్రీ ప్రైమరీ పిఎం శ్రీ ఇంగ్లీష్ మీడియం విద్య పేరుతో ఆరు సంవత్సరాలలోపు పిల్లలకు విద్యాశాఖకు అప్పగించడం సరైంది కాదని, ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణ వెనక్కి తీసుకొని ప్రీ ప్రైమరీ పీఎం శ్రీవిద్యను అంగన్వాడి కేంద్రాల్లోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు.

Read also : సీఎం సహాయ నిధి పేదలకు వరం : శ్రీనివాస సేవా సమితి చైర్మన్‌

విద్యా బోధన బాధ్యతను అంగన్వాడీ టీచర్స్ కి హెల్పర్స్ ఇవ్వాలని, వాలంటీర్లకిచ్చే అదనపు వేతనం అంగన్వాడీ టీచర్లకు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరిష్కరించాలని, బలోపేతం చేయాలని అంగన్వాడి టీచర్ హెల్పర్ పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో అంగనవాడి యూనియన్ ప్రధాన జిల్లా కార్యదర్శి కవిత, అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కోశాధికారి నాగమణి, 25 మందితో జిల్లా కమిటీని ఏకగ్రీవంగా మహాసభల్లో ఎన్నుకోవడం జరిగింది. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్రమోహన్, అధ్యక్షులు రాజు ఉపాధ్యక్షులు రుద్ర కుమార్, జగదీష్, జిల్లా కమిటీ మెంబర్ దేవేందర్, జిల్లా నాయకులు శ్రీను, ఎల్లేష్, నాయకులు గండిపేట మండలం సిఐటియు నాయకులు ఎం అశోక్, బి శ్రీనివాస్, లక్ష్మణ నాయక్, జనార్దన్ రెడ్డి, మైపాల్ యాదవ్, పి అనంతరావు, కే లక్ష్మణ్, నార్సింగ్ సెక్టార్ అంగన్వాడీ టీచర్స్ యూనియన్ నాయకురాలు సుధారాణి, జ్యోతి, శోభారాణి, కన్య, ఉషారాణి, రేణుక, రహిమ, నిర్మల, మంజుల, లతా, లలిత, సుజాత పాల్గొన్నారు.

Read also: కందుకూరులో టిడబ్ల్యూజేఎఫ్ మహాసభ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button