
క్రైమ్ మిర్రర్ : భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వడంపై మాకు ఎటువంటి అభ్యంతరం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ వేదికగా మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వడంపై ప్రతిపాదికను త్వరలోనే కేంద్రానికి పంపిస్తామని తెలియజేయగా బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మన్మోహన్ సింగ్కు భారతరత్న ఇవ్వడంపై పూర్తి మద్దతు తెలిపారు.
Read Also : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడు… సంక్రాంతి తర్వాత నియామకం!!!
భారతరత్న అవార్డు పొందేందుకు మన్మోహన్ సింగ్ పూర్తిగా అర్హులని కేటీఆర్ చెప్పుకొచ్చారు. అసలు ముందుగా మన్మోహన్ సింగ్ సామర్థ్యాన్ని గుర్తించింది మన తెలంగాణకు చెందిన పీవీ నరసింహారావు అని అన్నారు. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజుల్లోనే కేసీఆర్ కేంద్రంలో మంత్రిగా పని చేశారని తెలియజేశారు.
Also Read : రైతు భరోసా ఇప్పట్లో లేనట్లే! మళ్లీ ఆన్ లైన్ అప్లికేషన్స్ అట..
కాగా ఈ మధ్య ఆనారోగ్య కారణంగా మన భారతదేశ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇదే సమయంలో కాంగ్రెస్ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ కు భారతరత్న వచ్చేలా కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని తెలియజేయగా ఇదే సమయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా పూర్తిగా మద్దతు తెలపడం సర్వస్త్ర ప్రశంసలు వెదజల్లుతున్నాయి.
ఇవి కూడా చదవండి :