క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సామాజిక భద్రతా పింఛన్లను ఒక రోజు ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్నారు. అందులో భాగంగా మంగళవారం ఉదయం పల్నాడు జిల్లా ,నర్సరావుపేట మండలం, యలమందల గ్రామంలో సీఎం చంద్రబాబు ఇంటింటికి వెళ్లి అర్హులైన లబ్దిదారులకు ఫెన్షన్ పంపిణీ చేస్తున్నారు. అనంతరం ప్రజాప్రతినిధులు జిల్లా అధికారులతో ముఖ్యమంత్రి భేటీ అవుతారు. తర్వాత 1:45 గంటలకు కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. తిరిగి సాయంత్రం 3 గంటలకు హెలికాప్టర్ ద్వారా సీఎం చంద్రబాబు ఉండవల్లి తన నివాసానికి చేరుకుంటారు. కాగా రాష్ట్రంలో మంగళవారం ఉదయం నుంచి ముమ్మరంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరుగుతోంది.
Read Also : ఏడాది చివరి రోజు కూడా హైడ్రా కూల్చివేతలు.. ఆందోళనలో బాధితులు
63,77,943 మందికి పింఛన్ల పంపిణీ కోసం రూ.2717 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. కొత్త సంవత్సరం నేపథ్యంలో 31వ తేదీనే పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం చేపట్టింది. జనవరి 1కి ముందే పేదల ఇళ్లల్లో పింఛను డబ్బు ఉండాలని ఒక రోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం చేపట్టింది. మంగళవారం ఉదయం నుంచి ఇప్పటి వరకు 85.45 శాతం మందికి పింఛన్ల పంపిణీ పూర్తి చేశారు. ఉదయం 10 గంటలకు సమయానికే 53,22,406 మందికి రూ.2256 కోట్లు పంపిణీ చేశారు. లబ్దిదారుల ఇళ్లను జీయో ట్యాగింగ్ చేసి పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు పరిశీస్తున్నారు. ఇళ్ల వద్దే పింఛన్లు ఇస్తున్నారా లేదా అనే విషయాన్ని జీయో ట్యాగింగ్ ద్వారా గమనిస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఇంటి వద్దనే పింఛన్లు ఇవ్వాలనే ఉద్దేశ్యంతో జీయో ట్యాగింగ్ విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చింది.
ఇవి కూడా చదవండి :
- తాగి రోడెక్కారో అంతే సంగతి.. తెలంగాణ పోలీసులు తీవ్ర హెచ్చరికలు జారీ!!
- దేశంలోనే సంపన్న ముఖ్యమంత్రిగా చంద్రబాబు!… మరి రేవంత్ స్థానం?
- ఇంత పెద్ద మొత్తం.. సంధ్య థియేటర్‌లో సంచలనం సృష్టించిన ‘పుష్ప 2’!!
- గ్రామస్థాయి రెవెన్యూ అధికారి (వీఎల్‌వో) పోస్టులకు దరఖాస్తుల వెల్లువ..
- ఏపీ సీఎం చంద్రబాబుకు రేవంత్ రెడ్డి కృతజ్ఞతలు…