
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని వైసీపీకి ఎటువంటి పనులు గాని లేదా సహాయం కాని చేయకండి అని అన్నారు. వైసిపి శ్రేణులకు ప్రత్యక్షంగా గాను లేదా పరోక్షంగా గాను ఎటువంటి పనులు చేయకండి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఈ విషయాన్ని పార్టీ శ్రేణులకు గట్టిగా చెబుతున్నాను అంటూ నారా చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఈ మాటలు అన్నారు. తాజాగా జీడీ నెల్లూరు కార్యకర్తలతో సమావేశంలో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండాలని సూచించారు. నాయకులు అందరూ కూడా నా చుట్టూ కాకుండా ప్రజల చుట్టూ తిరుగుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
ఘనంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు
అయితే తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైసిపి స్పందించింది. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా ఇలాంటి మాటలు చెప్పడం సబబు కాదని వైసీపీ శ్రేణులు బాబు పై మండిపడ్డారు. ఎన్నికల వరకే రాజకీయాలు ఉండాలి కానీ పాలనలో ఎటువంటి వివక్షత చూపడం సరికాదని అంటున్నారు. అయితే వైసిపి చేస్తున్న విమర్శలపై మళ్లీ టీడీపీ శ్రేణులు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ తొమ్మిది నెలల్లో ఏ వైసీపీ సానుభూతిపరుడు కైనా పథకాలు ఆపిన ఉదాంతాలు ఉన్నాయా?.. అని టిడిపి నేతలు మరియు కార్యకర్తలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నారు. మరి ఈ విషయంపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేసి తెలపండి.
ఉక్రెయిన్ అధ్యక్షుడికి ఎందుకు అంత ధైర్యం… అసలు అతను ఎవరు?