
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్ర పోలీసులు నిన్న హిడ్మా అనే డేంజరస్ మావోయిస్టు ను ఎన్కౌంటర్ చేసిన విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. సాధారణంగా మావోయిస్టు అంటేనే కొంచెం డేంజర్ అని.. వీరిని ఖచ్చితంగా 2026 మార్చి 31 లోపు అంతం చేస్తామని హోం మంత్రి అమిత్ షా కూడా చెప్పుకొచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే చతిస్గడ్ లో జన్మించిన ఈ హిడ్మా అనే మావోయిస్టు దక్షిణ బస్తర ప్రాంతంలో ఇతనికి చాలా గట్టుపట్టు ఉండేది. ఎన్నోసార్లు పోలీసుల చేతిలో నుంచి తప్పించుకున్నారు అంటే ఇతను ఏంటో ఈపాటికి మనకు అర్థమయ్యే ఉంటుంది. ఒకానొక సమయంలో కేవలం ఈ హిడ్మా అనే ఒక మావోయిస్టు అంతం చేస్తే మొత్తం మావోయిజం అంతమవుతుంది అని పోలీసులు భావించారు. ఈ సందర్భంలోనే కొన్ని నెలలుగా చతిస్గడ్ ప్రాంతంలో వరుసగా ఎన్కౌంటర్లు జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతం అసలు సేఫ్ కాదు అని.. ఏమనుకున్నాడో తెలియదు కానీ అతను మన ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాల్లోని అడవులకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే గత రెండు నెలల నుంచి ఇతడి పై నిఘా వేసినటువంటి ఏపీ పోలీసులు చాలా చాకచక్యంగా అలాగే పక్క వ్యూహాలతో హిడ్మా పై దాడి చేసి చంపేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసులు హెడ్మా ఎన్కౌంటర్లో సక్సెస్ అయ్యారు అని ఇప్పటికే చాలామంది ఏపీ పోలీసులను ప్రశంసిస్తున్నారు. మరి ఈ హిడ్మా ఎన్కౌంటర్ పై మీ అభిప్రాయం ఏంటో తెలియజేయండి.
Read also : ఊపందుకున్న పంచాయతీ ఎన్నికల ప్రక్రియ..!
Read also : జైల్లో వేస్తే డిప్రెషన్ కు గురువుతాను అనుకున్నారేమో… నేను తెలంగాణ ఆడబిడ్డని : కవిత





