
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులకు వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ సోషల్ మీడియా ద్వారా లేదా ఇతర వేటి ద్వారానైనా దుష్ప్రచారం చేస్తే వెంటనే ఆ విషయాలపై మంత్రులు స్పందించి తగిన సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంత్రులను హెచ్చరించారు. అలా చేయని పక్షంలో.. ఇప్పుడున్న మంత్రుల స్థానంలో కొత్తవారు వస్తారని ఇవాళ జరిగిన క్యాబినెట్ బేటిలో తీవ్రంగా మంత్రులను హెచ్చరించారు. కాబట్టి ఎక్కడైనా సరే వైసీపీ నాయకులు ఎటువంటి దుష్ప్రచారాలు చేసిన వెంటనే ఖండించాలని పిలుపునిచ్చారు. అలాగే మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ బాండ్లలో పెట్టుబడులు పెట్టవద్దని దాదాపు 200 కంపెనీలకు వైసీపీ తాజాగా ఇమెయిల్ ల రూపంలో పెట్టించినట్లుగా మంత్రి కేశవ్ సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఈ ఆగ్రహించిన చంద్రబాబు నాయుడు వెంటనే వైసిపి కుట్రలపై విచారణకు ఆదేశిస్తానని కరాకండిగా తెలిపారు. ఏది ఏమైనా కూడా మంత్రులకు చంద్రబాబు నాయుడు వార్నింగ్ ఇవ్వడం అనేది ఒక వైపు పార్టీకి మంచిదే అనిపిస్తుంది. ఎందుకంటే రాజకీయంలో ఏదైనా ప్రతిపక్ష పార్టీని ఓడించాలంటే కచ్చితంగా దుష్ప్రచారాలను అడ్డుకోవాలి. దీంతో చంద్రబాబు నాయుడు ముందస్తు జాగ్రత్తగా ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసేటటువంటి దుష్ప్రచారాలను మంత్రులు అడ్డుకోవాలని మంత్రులకు పిలుపునిచ్చారు. దీంతో అన్ని శాఖల మంత్రులు ఈ విషయంపై దృష్టి పెడుతున్నారు.
జగన్ ను చూడాలని ఎగబడ్డ కార్యకర్తలు.. తోపులాటలో ఇరుక్కుపోయిన రోజా?