జాతీయం

ఆంధ్ర కుర్రాడా మజాకా...

ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ తో జరుగుతున్న t20 లో అంతర్జాతీయంగా నితీష్ కుమార్ రెడ్డి అరంగేట్రం చేసిన విషయం తెలిసిందె. అయితే ఆడిన మొదటి మ్యాచ్లో పర్వాలేదనిపించినా రెండో మ్యాచ్లో మాత్రం ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఢిల్లీలో జరిగినటువంటి బంగ్లాదేశ్ తో రెండో టి20 లో ఆంధ్రప్రదేశ్ చెందినటువంటి నితీష్ కుమార్ రెడ్డి అందరిని కూడా ఆశ్చర్యానికి గురి చేశాడు. తన ఆటతో అలాగే ఆ షాట్లతో అందరూ కూడా బిత్తర పోయి మరి చూశారు.

బంగ్లాదేశ్ తో జరుగుతున్నటువంటి రెండో టి20 లో ఇండియా తరఫున నితీష్ కుమార్ రెడ్డి కేవలం 34 బాల్ లోనే 74 రన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించాడు. ఏకంగా ఏడు సిక్సులు నాలుగు ఫోర్ లతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. దీంతో ఇండియా స్కోర్ అనేది భారీగా ముందుకు తీసుకెళ్తుంది. ఐపీఎల్ లో హైదరాబాద్ తరపున ఆడుతున్నటువంటి నితీష్ కుమార్ రెడ్డి మంచి పర్ఫామెన్స్ ఇవ్వడం వల్ల ఇండియన్ టీం కి సెలక్ట్ చేశారు. దీంతో వచ్చిన అవకాశాన్ని నితీష్ కుమార్ రెడ్డి రెండో మ్యాచ్ లోనే హాఫ్ సెంచరీ చేసి అతి తక్కువ వయసులోనే ఇంటర్నేషనల్ మ్యాచ్లో నాలుగవ హాఫ్ సెంచరీ చేసిన వాడిగా రికార్డ్ సృష్టించాడు. అయితే ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఉండగా ముస్తాఫిజర్ చేసినటువంటి బౌలింగ్లో అవుట్ అయిపోయాడు. కొంచెం లో సెంచరీ మిస్ అవుతుండగా అయినా సరే తన ఆటతో అందరి మనుసులను గెలుచుకున్నాడు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా అన్ని నితీష్ రెడ్డి ఫ్యాన్స్ అందరూ కూడా వరల్డ్ కప్ లో ఆడాలని అనుకుంటున్నారు.

Back to top button