
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- యంగ్ టైగర్ ఎన్టీఆర్ వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎందుకంటే ఈ ఫోటోలు మరియు వీడియోలలో జూనియర్ ఎన్టీఆర్ చాలా సన్నగా.. స్లిమ్ గా మారిపోవడమే దానికి కారణం. మరి చాలా సన్నగా మారిపోవడంతో ఎన్టీఆర్ అభిమానులైతే ఆందోళనకు గురవుతున్నారు. తను చేయబోయే తర్వాత సినిమా కోసం ఎన్టీఆర్ ఇలా వర్కౌట్ చేసినట్లు అర్థమవుతున్న కూడా… మరీ ఒకేసారి అంతలా చేంజ్ అవ్వడం చూసి ఫ్యాన్స్ కూడా తెగ కంగారు పడుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్ లడ్డుగా ఉన్నాడని విమర్శలు రాగా.. మళ్లీ చాలా రోజుల తర్వాత చాలా సన్నగా అయిపోయాడు అంటూ ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. అసలు జూనియర్ ఎన్టీఆర్ కు ఏమైంది?.. నిజంగానే సినిమా కోసం తగ్గిపోయాడా?.. లేదా ఆరోగ్యం ఏమైన బాగాలేదా?.. అంటూ సోషల్ మీడియా వేదికగా నందమూరి అభిమానులు ప్రశ్నల రూపంలో కామెంట్లు చేస్తున్నారు. చాలా రోజుల తర్వాత కంత్రి మూవీ లుక్ లోకి మారిపోయారు అంటూ.. చర్చించుకుంటున్నారు. అరవింద సమేతలో జూనియర్ ఎన్టీఆర్ లెక్క అద్భుతంగా ఉంది అని… అలానే కొనసాగుతూ ఉండాలి అని యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అయితే ఎన్టీఆర్ ఇలా పూర్తిగా సన్నగా మారిపోవడానికి కారణాలు ఏమయ్యి ఉంటాయి అని.. ఎవరో ఒకరు ఎన్టీఆర్ గురించి వివరణ ఇస్తే కానీ అప్పటివరకు అభిమానులు ఆందోళనలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. మరి జూనియర్ ఎన్టీఆర్ ఇలా సన్నగా మారిపోవడం పై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.
Read also : థియేటర్లలో తినుబండారాల ధరల పై సుప్రీంకోర్టు ఆగ్రహం!
Read also : కాంగ్రెస్ ప్రభుత్వం విద్యాసంస్థల పట్ల ప్రవర్తిస్తున్న తీరుపై బండి సంజయ్ ఫైర్





