
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- యాంకర్ అనసూయ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించి పలు ఫోటోలను పోస్ట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. గత కొద్ది రోజుల క్రితం శివాజీ మరియు అనసూయ మధ్య వివాదం అనేది ఇప్పటికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొనసాగుతూనే ఉంది. అయితే ఈ గొడవ ముగుస్తుంది అనుకున్న సమయంలో తాజాగా యాంకర్ అనసూయ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయారు. ఎందుకంటే తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా స్విమ్ సూట్ లో దిగినటువంటి ఫోటోలను తన ఇన్స్టా వేదికగా పోస్ట్ చేశారు. ఇప్పటికే మహిళల దుస్తులు పై శివాజీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపగా ఈ నేపథ్యంలో ఈ వివాదం ముగయకూడదు అనుకునేలా అనసూయ మరో కొన్ని బికినీ ఫోటోలు షేర్ చేయడంతో ఆమె ఉద్దేశపూర్వకంగానే చేశారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
Read also : సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రభుత్వం గుడ్ న్యూస్!
నా బాడీ నా ఇష్టం అంటూనే తనకు నచ్చినట్లుగా ఫోటోలను షేర్ చేస్తూ ఉండడంతో పలువురు వ్యక్తులు ఆమెపై సోషల్ మీడియాలో నెగిటివ్గా కామెంట్లు చేస్తున్నారు. ఇంతటితో ఈ వివాదాన్ని ముగియకుండా చేసే విధంగా ఆమె పోస్టులు చేస్తున్నారంటూ ఇంకొంతమంది అనసూయ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా మంచి బట్టలు ధరించండి అని చెప్పిన శివాజీకి ఇప్పటికీ కూడా కొన్ని చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొంతమంది శివాజీకి సపోర్ట్ చేస్తుండగా.. చాలామంది వ్యక్తులు అనసూయకు కూడా సపోర్ట్ చేయడంతో ఈ వివాదం మరింత పెద్దదయింది. దీంతో వీరిద్దరి మధ్య వివాదం ఇంతటితో ముగిసేలా కనిపించడం లేదు.
Read also : అన్వేష్ అనుచిత వ్యాఖ్యలు.. దేశద్రోహిగా ప్రకటించాలన్న హిందూ సంఘాలు?





