Homeజాతీయంరాఘ‌వ క‌న్‌స్ర్ట‌క్ష‌న్స్‌పై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాలి...హ‌రీశ్ రావు ఫైర్‌

రాఘ‌వ క‌న్‌స్ర్ట‌క్ష‌న్స్‌పై వెంట‌నే విచార‌ణ చేప‌ట్టాలి…హ‌రీశ్ రావు ఫైర్‌

హైద‌రాబాద్‌, క్రైమ్ మిర్ర‌ర్: హైద‌రాబాద్‌లోని (తెలంగాణ అమ‌ర‌వీరుల స్మార‌కం ) గ‌న్ పార్కు వ‌ద్ద ఆదివారం బీఆర్ ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ , మాజీ మంత్రి హ‌రీశ్ రావు ఎమ్మెల్యేల‌తో క‌లిసి భారీ నిర‌స‌న చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ మంత‌రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి కుటుంబానికి చెందిన రాఘ‌వ క‌న్ స్ర్ట‌క్ష‌న్ అక్ర‌మంగా మైనింగ్‌కు పాల్ప‌డింద‌ని, దీనిపై విచార‌ణ వెంట‌నే చేప‌ట్టాల‌ని డిమాండ్ చేశ‌శారు.

ఈ అక్ర‌మాల‌పై అసెంబ్లీలో హౌజ్ క‌మిటీ వేయాల‌ని, లేదా హై కోర్టు సిట్టింగ్ జ‌డ్జీతో విచార‌ణ జ‌రిపించాల‌ని కేటీఆర్ కోరారు. త‌ప్పు చేయ‌న‌ప్పుడు విచార‌ణ‌కు ఎందుకు బ‌య‌ప‌డుతున్నార‌ని అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. మైనింగ్‌లో జ‌రిగిన అక్ర‌మాల వ‌ల్ల ప్ర‌భుత్వ ఖ‌జాన‌కు భారీగా గండిప‌డింద‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా బీఆర్ ఎస్ ఎమ్మెల్యేలతో క‌లిసి ఫ్ల‌కార్డుల‌తో నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న నిర్వ‌హించారు.

ఈ సంద‌ర్భంగా హ‌రీశ్ మాట్లాడుతూ ఆరు గ్యారంటీలతో గ‌ద్దెనెక్కిన కాంగ్రెస్ స‌ర్కార్ ఏ ఒక్క హామిని కూడ‌ పూర్తిగా అమ‌లు ప‌రుచ‌లేద‌ని దుయ్య‌బట్టారు. కాంగ్రెస్ స‌ర్కార్ చేస్తున్న మోసాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నిస్తున్నార‌ని రాబోయే ఎన్నిక‌ల్లో గ‌ట్టి గుణ పాఠం చెబుతార‌ని హెచ్చ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో నాయ‌కులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments