Thursday, March 12, 2026
Homeఆంధ్ర ప్రదేశ్అమెరికా, ఇజ్రాయెల్‌ది సామ్రాజ్య‌వాద దాడులు...! బీజేపీ మౌనం వెనుక ర‌హ‌స్యం ఏమిటో...?

అమెరికా, ఇజ్రాయెల్‌ది సామ్రాజ్య‌వాద దాడులు…! బీజేపీ మౌనం వెనుక ర‌హ‌స్యం ఏమిటో…?

  • సీఐటీయురాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి

పరవాడక్రైమ్ మిర్ర‌ర్: అమెరికా, ఇజ్రాయిల్ లు ఇరాన్‌పై చేస్తున్న సామ్రాజ్యవాద దాడిని ప్రజలంతా వ్యతిరేకించాలని సీఐటీయు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గని శెట్టి సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం సీఐటీయు ఆధ్వర్యంలో పరవాడ మండలం లంకెలపాలెం జాతీయ రహదారిపై యుద్ధ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా గని శెట్టి మాట్లాడుతూ ఇరాన్ పై ట్రంప్ చేస్తున్న దాడులు అత్యధిక మంది అమెరికన్లు వ్యతిరేకిస్తున్నార‌ని తెలిపారు.

ఈదాడిని కేంద్ర ప్ర‌భుత్వం ఖండించ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు. ఇరాన్ మన దేశానికి చిరకాల మిత్ర దేశం. మనకు అవసరమైన మూడోవంతు చమురులో అత్యధిక ఈ దేశం నుండి సరఫరా అవుతుంది. అలాంటి దేశంపై జరుగుతున్న ఈ క్రూర దాడులను కనీసం కేంద్ర బిజెపి ప్రభుత్వం ఖండించకపోవడం అమెరికా, ఇజ్రాయిల్ నేతలతో కేంద్ర బిజెపి పెద్దలకు ప్రభుత్వానికి ఉన్న కార్పొరేట్ అనుకూల. మతతత్వ అనుబంధం ప్రధానమైనదిగా కనబడుతుంది అని గని శెట్టి అన్నారు.అమెరికా యుధన్మాదాన్ని నిరసించాలని అన్నారు.

యుద్ధం వద్దు శాంతి కావాలి అని నినాదాలు చేశారు.అమెరికన్ సామ్రాజ్యవాదం ప్రపంచ దేశాలపై పెత్తనంలో భాగంగా గత పది రోజులుగా ఇజ్రాయిల్ తో కలిసి అమెరికా ఇరాన్ పై చేస్తున్న యుద్ధం కారణంగా ప్రపంచ దేశాల్లో ముఖ్యంగా భారతదేశంలో ప్రజలు కు తీవ్ర నష్టం కలుగుతుంద‌న్నారు, వెంటనే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ ధరలను కేంద్ర బీజేపీ ప్రభుత్వం పెంచిందని, మనదేశంలో హోటల్స్ సంక్షోభంలో చిక్కుకున్నాయ‌న్నారు.

కమర్షియల్ గ్యాస్ ధరలను భారీగా పెంచగా, క్షేత్రస్థాయిలో పిచ్చలవిడిగా జరుగుతున్న బ్లాక్ మార్కెటింగ్ తో హోటల్ యజమానులు దిక్కుతోచని పరిస్థితుల్లో చిక్కుకున్నార‌ని ఆవేద‌న చెందుతున్నారు. చమురు నిక్షేపాల కోసం అమెరికా పన్నుతున్న కుట్రలను ప్రపంచ దేశాల్లో వ్యతిరేకిస్తున్నాయని, దేశంలోని బిజెపి ప్రభుత్వం మాత్రం మౌనం వహించి పరోక్షంగా ఇజ్రాయిల్ కు సహకరిస్తోందన్నారు.

యుద్ధంలో అమెరికా ఇరాన్ లో ఆసుపత్రిలు, పాఠశాలలపై బాంబుల వర్షంతో పసిపిల్లల ప్రాణాలు పోతున్నాయని అన్నారు. విశాఖపట్నంలో జరిగిన ఐ ఎఫ్ ఆర్ కి వచ్చి వెనక్కి వెళ్తున్న నౌకపై అమెరికా దాడి చేసి 100 మంది ఇరాన్ సైనికులను శ్రీలంక సముద్ర జలాల్లో హ‌త్య చేసింద‌న్నారు. ఈ కార్యక్రమంలో సీఐటీయు జిల్లా నాయకులు బొద్ధపు. శ్రీనివాసరావు , అప్పికొండ గోవిందా, టి శ్రీను, జి సూరప్పారావు, టి .మహాలక్ష్మి నాయుడు, టి అప్పారావు, రాజు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments