
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ సినిమాపై ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. తరచూ పవన్ కళ్యాణ్ పై అలాగే తన పార్టీపై నిత్యం విమర్శలు కురిపించే అంబటి రాంబాబు నేడు పవన్ కళ్యాణ్ గురించి మంచిగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజకీయాల్లోకి వచ్చి… ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి డిప్యూటీ సీఎం గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ పెండింగ్ లో ఉన్నటువంటి సినిమా పూర్తి చేసుకుని రేపు అన్ని థియేటర్లలో విడుదల కు సిద్ధంగా ఉంది. ఆ సినిమా పేరే హరిహర వీరమల్లు. అయితే పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్గా వస్తున్నటువంటి సినిమా హరిహర వీరమల్లు. ఈ సినిమా జులై 24 అనగా రేపు థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా వైసీపీ మాజీమంత్రి అంబటి రాంబాబు హరిహర వీరమల్లు సినిమాపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
తెలంగాణలో ఒకవైపు భారీ వర్షాలు… మరోవైపు ఉప్పొంగుతున్న జలపాతాలు!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నటించినటువంటి హరిహర వీరమల్లు సినిమా సూపర్ డూపర్ హిట్ కావాలని అంబటి రాంబాబు కోరారు. ‘హరిహర వీరమల్లు సూపర్ డూపర్ హిట్ అయి.. కనక వర్షం కురవాలని కోరుకుంటున్నానని’.. X వేదికగా అంబటి రాంబాబు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ను పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అలాగే కొణిదల నాగబాబుకు ట్యాగ్ చేశారు. దీంతో నిత్యం విమర్శలు గుప్పించే అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ సినిమా గురించి ఇంతలా కోరుకోవడమేంటని చాలామంది ఆశ్చర్యపోతున్నారు. అయితే మరికొందరు మాత్రం ఇది కూడా సెటైరికల్ ట్విట్ అని కొంతమంది ఈ సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా కూడా అంబటి రాంబాబు పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి ఇలాంటి మంచి ట్వీట్ చేయడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇకపై సినిమాల్లో నటించను… కానీ నిర్మాతగా సినిమా ఇండస్ట్రీలోనే ఉంటాను : పవన్ కళ్యాణ్