
చినుకు పడితే అంతా చిత్తడే..
పాఠశాల.. లేక పడాబడిన బంగ్లా నా..?
ఈ చిత్రం విద్యాధికారికి, మండల అధికారులకు, రాజకీయ నాయకులకు కనబడడం లేదా..?
ఒకవేళ కనబడిన మనకెందుకులే అనుకుంటున్నారా..?
క్రైమ్ మిర్రర్ ప్రతినిధి, వేములపల్లి: నల్గొండ జిల్లా వేములపల్లి మండలం పరిధిలోని ఆమనగల్లు గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నంత పాఠశాల చినుకు పడితే చాలు అంతా చిత్తడి చిత్తడి గా కనబడుతుంది.. ఇది పాఠశాలనా లేక పడాబడిన బంగ్లానా అన్నట్లు దర్శనమిస్తుంది. మండల అధికారులకు, విద్యాధికారికి పలుసార్లు విన్నమించినప్పటికీ ఇటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదని రాజకీయ నాయకుల, అధికారుల తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు మండిపడుతున్నారు..
Also Read:పథకాలను,చట్టాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలం
ఒకవైపు కోతుల బెడద తో, చినుకు పడితే చాలు అడుగుపెట్టనిల్లంతగా చిత్తడి చిత్తడి అవుతున్న పాఠశాలను చూసి విద్యార్థులు అడలిపోతున్నారు. పాఠశాలకు వెళ్లాలంటేనే విరక్తి పుడుతుందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ నాయకులు అనేకమార్లు స్కూళ్లను అభివృద్ధి చేస్తాం పాఠశాలలు దేవాలయ తో సమానమని గొప్పలు చెప్పడం కాదు ఆ మాటలను నిజం చేసి చూపించాలని విద్యార్థులు తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు..
మన ఊరు మనబడి కార్యక్రమంతో పాఠశాలలను అభివృద్ధి చేశాం అని గొప్పలు చెప్పడమే తప్ప అభివృద్ధి ఎంతవరకు జరిగిందో ఈ చిత్రం చూస్తే తెలిసిపోతుంది అని మండిపడుతున్నారు.. మైకుల ముందల గొప్పలు చెప్పడం కాదు విద్యార్థుల భవిష్యత్తును దుష్టులో ఉంచుకొని సమస్యను పరిష్కరించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు..
Also Read:వడ్లు కొనుగోలు లేదు… రోడ్డు ఎక్కిన రైతన్నలు
విద్యాధికారి మండల అధికారుల దృష్టికి ఈ సమస్యను పలుమార్లు తీసుకెళ్లినప్పటికీ వారు పెడచెవిన పెడుతున్నారని తల్లిదండ్రులు విమర్శిస్తున్నారు.. అధికారులే పట్టించుకోకపోతే మా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ముందుకు జరుగుతుంది అని ప్రశ్నిస్తున్నారు.. విద్యార్థులు ప్రతిరోజు పాఠశాలలకు క్రమం తప్పకుండా వెళ్లాలంటే పాఠశాలలో పాఠశాల చుట్టూ ప్రకృతి బాగుంటేనే వారు చదివినవి గుర్తుపెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
కానీ ఈ పరిస్థితిని చూసి ఏ తల్లిదండ్రులు ఇలాంటి పాఠశాలలకు పంపించాలంటే ఆసక్తి చూపకపోవడానికి మొదటి కారణాలుగా చెప్పవచ్చు.. ప్రభుత్వ బడులలో విద్యార్థుల సంఖ్య రోజుకి తగ్గుతుందంటే అధికారులు రాజకీయ నాయకులు ప్రభుత్వ పాఠశాలలను పట్టించుకోవడం తో ప్రైవేట్ పాఠశాలలకు మొగ్గు చూపుతున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు అని పలువురు అభిప్రాయపడుతున్నారు..
ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించి విద్యార్థులు పాఠశాలకు వెళ్లే విధంగా చూడాలని తల్లిదండ్రులు కోరుతున్నారు…
Also Read:ఏపీకి పొంచి ఉన్న ముప్పు… ఒక వైపు తుఫాను, మరోవైపు వరదలు!





