
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :- మెగాస్టార్ చిరంజీవి నేడు 70వ పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. ఇప్పటికే ఎంతోమంది సోషల్ మీడియా వేదిక ద్వారా చాలామంది ప్రముఖులు మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా చిరంజీవికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిరంజీవికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ” సినిమా ప్రపంచంలో, ప్రజా జీవితంలో మీ అద్భుతమైన ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది అని అన్నారు. దాతృత్వం, అంకిత భావంతో మీరు ఇలాగే చాలామంది జీవితాలను సృష్టించడం కొనసాగించాలి… చిరంజీవి ఎప్పుడూ మంచి ఆరోగ్యంగా, ఆనందంగా రాబోయే రోజుల్లో మరింత చిరస్మరణీయం కావాలని కోరుకుంటున్నా” అని సోషల్ మీడియా వేదికగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్వీట్ చేశారు.
Read also : కృష్ణమ్మ పరవళ్లు, శాంతిస్తున్న గోదావరి!
కాగా ఒకప్పుడు చిరంజీవి ఎన్నో కష్టాలలో, నష్టాలలో ఓపికతో ఈరోజు ఎంతోమంది హీరోలను సృష్టించడం అంత సులభం కాదు. కానీ ఒక్క చిరంజీవికి మాత్రమే ఇది సాధ్యమైంది. ఒకప్పుడు మెగా ఫ్యామిలీ అంటే ఏంటో తెలియదు. కానీ నేడు మెగా ఫ్యామిలీ అంటే అందులో ఉన్న హీరోలందరూ కూడా సూపర్ స్టార్స్. చిరంజీవితో మొదలుకొని, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అర్జున్, సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్.. ఇలా ఎంతోమంది హీరోలను చిరంజీవి తయారు చేశారు. ఒక విత్తనమే ఈరోజు వృక్షంగా మారింది. వీళ్ళందరూ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి సూపర్ స్టార్స్ గా ఎదిగిపోతున్నారు. నేడు చిరంజీవి 70వ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే చిరంజీవి అభిమానులు సోషల్ మీడియా వేదికగా బర్త్డే విషెస్ చెబుతున్నారు. మరోవైపు చిరంజీవి స్థాపించిన బ్లడ్ బ్యాంకులో.. చిరంజీవి అభిమానులు బ్లడ్ను అందిస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా… యావత్ భారతదేశం అంతటా కూడా చిరంజీవి అభిమానులు ఎంతో మంది ఉన్నారు. ఒకవైపు సినిమాల్లోనూ రాణిస్తూ.. మరోవైపు ఎంతోమందికి చిరంజీవి సహాయం కూడా చేస్తున్నారు.
Read also : రాజస్థాన్ లో డైనోసార్ శిలాజం, ఎన్ని ఏండ్ల నాటిదంటే?