Homeక్రీడలుఇదంతా దేవుడి రాత.. ఎమోషనల్ అయిన సిరాజ్?

ఇదంతా దేవుడి రాత.. ఎమోషనల్ అయిన సిరాజ్?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టి20 వరల్డ్ కప్ ప్రారంభమైన వేల భారత జట్టు ఫాస్టు బౌలర్ మహమ్మద్ సిరాజ్ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. అదృష్టం తలుపు తడితే ఎలా ఉంటుందో అనేది సిరాజ్ జీవితంలో చాలాసార్లు చూసాం. ఇక వరల్డ్ కప్ కు సెలెక్ట్ కానీ మహమ్మద్ సిరాజ్.. వరల్డ్ కప్ కు ఒకరోజు ముందుగానే జట్టులో చేరి ఫస్ట్ మ్యాచ్ లోనే తన బౌలింగ్ తో అద్భుతమైన ప్రదర్శన చేశారు. అయితే ఈ విషయంపై తాజాగా సిరాజ్ స్పందిస్తూ.. ఇదంతా దేవుడి ప్లాన్ అంటూ ఎమోషనల్ అయ్యారు. ఇక టి20 వరల్డ్ కప్పుకు జట్టు సెలక్షన్ అయిపోయింది అని.. ఒక సంవత్సరం నుంచే వరల్డ్ కప్ లో ఆడేటువంటి వారికి టి20 లో ఛాన్స్ లిస్తూ వస్తున్నారు అని తెలిపారు. ఈ క్రమంలోనే నేను వరల్డ్ కప్పులో భాగం కాలేను అని ఫిక్స్ అయ్యాను. కానీ మ్యాచ్ కు ఒక రోజు ముందు కెప్టెన్ సూర్య బాయ్ కాల్ చేసి సిరాజ్ వెంటనే బ్యాగు సర్దుకో అని చెప్పారు. ఆ సమయంలో నేను జోక్ చేయొద్దు అని సూర్యకు చెప్పాను. అయితే వెంటనే అలాంటిదేం లేదు నువ్వు జట్టుకు ఇప్పుడు అవసరం అంటూ వెంటనే బయలుదేరి వచ్చేసేయ్ అని ఫోన్ కాల్ లో చెప్పేసరికి భావోద్వేగానికి గురయ్యాను అని అన్నారు. దేవుడు రాసిన తలరాతను ఎవరూ మార్చలేరు అని సిరాజ్ ఎమోషనల్ అయ్యారు. సిరాజ్ జట్టులో భాగమవడంతో టీమిండియా కు మరింత బలం చేకూరింది.

Read also : కేటీఆర్, కిషన్ రెడ్డి పై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు?

Read also : గెలుపే లక్ష్యంగా జిన్నారెడ్డి ప్రచారం

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

Most Popular

Recent Comments