
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ఉన్నటువంటి గ్రామ సచివాలయ పేరును మారుస్తున్నట్లుగా వస్తున్నటువంటి వార్తలు అవాస్తవమని తాజాగా సీఎంఓ వివరణ ఇచ్చింది. ఈ గ్రామ సచివాలయాల పేరును విజన్ యూనిట్లుగా మార్చుతారు అని వస్తున్నటువంటి వార్తలను ప్రజలు ఎవరు నమ్మవద్దు అని సూచించింది. ఇక 2027 స్వర్ణాంధ్ర విజయం సాధన కోసం విజన్ యూనిట్లుగా గ్రామ మరియు వార్డు సచివాలయాలు పనిచేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలను జారీ చేశారని పేర్కొన్నారు. కేవలం ఒక విజన్ గా గ్రామం మరియు వార్డు సచివాలయాలు పనిచేయాలి అని సూచించారే తప్ప వాటి పేరును విజన్ యూనిట్లుగా మార్చట్లేదని తెలిపారు. కాగా సచివాలయం అన్న పేరు వినగానే ప్రతి ఒక్కరికి కూడా జగనే గుర్తుకు వస్తారు. ఎందుకంటే జగన్ ప్రభుత్వంలోనే ప్రతి గ్రామంలోనూ సచివాలయము నిర్మించి.. చిన్న చిన్న పనుల నుంచి పెద్దపెద్ద పనులు వరకు కూడా ప్రతి ఒక్కటి అందులోనే ఇబ్బందులు లేకుండా పరిష్కరించుకునే విధానం తీసుకువచ్చారు జగన్. దీని ద్వారా ప్రజలకు కూడా చాలా అంటే చాలానే మేలు జరిగింది.
Read also : మరో మతాన్ని కించపరచను.. తలైన నరుక్కుంటా కానీ ముస్లిం టోపీ పెట్టుకోను : బండి సంజయ్
Read also : యువతే కదా ఏం చేస్తారు అనుకోకండి.. తలచుకుంటే ప్రభుత్వాలే మారిపోతాయి : వైయస్ జగన్





