
క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి అని హోం మంత్రి అనిత సూచించారు. తుఫాన్ కారణంగా రేపు మరియు ఎల్లుండి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో హోం మంత్రి అనిత వెంటనే ఆయా సంబంధిత అధికారులను అప్రమత్తం చేశారు. సోమవారం సాయంత్రం వరకు కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అని ఆమె సూచించారు. వాయుగుండం కారణంగా అత్యధికంగా తిరుపతి, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు మరియు కడప జిల్లాలలో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే హోం మంత్రి అనిత ఈ ఐదు జిల్లాల ఎస్పీలు మరియు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ఈ రెండు రోజులపాటు ముఖ్యంగా ఈ ఐదు జిల్లాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని తెలిపారు. మరి ముఖ్యంగా NDRF, SDRF బృందాలు అన్ని జిల్లాలలో మరోసారి సిద్ధంగా ఉండాలి అని సూచించారు. ప్రతి మండలంలోనూ కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేయాలని హోం మంత్రి అనిత అధికారులను ఆదేశించారు. కాగా ఇప్పటికే ముంత తుఫాన్ కారణంగా ప్రజలు చాలా రకాలుగా నష్టపోయారు. మరోసారి భారీ వర్షాలు కురుస్తాయి అన్న నేపథ్యంలో ప్రజలందరూ ప్రభుత్వం గా ఉండాలని సూచించారు.
Read also : సికింద్రాబాద్: మాజీ సైనికులకు ఉద్యోగ మేళా
Read also : అనారోగ్యానికి గురైన ఏడు నెలల గర్భిణీ ఉద్యోగి.. సెలవు ఇవ్వకపోగా.. తిట్టిన మేనేజర్!





