క్రీడలు

న్యూ గర్ల్ ఫ్రెండ్ తో చిల్ అవుతున్న ఆల్ రౌండర్ హార్దిక్..!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- టీమ్ ఇండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ప్రస్తుతం తన న్యూ గర్ల్ ఫ్రెండ్ మహికా శర్మతో చిల్ అవుతూ ఉన్నారు. ఖాళీగా ఉన్న ప్రతి సమయంలోనూ తనతోనే సరదాగా గడుపుతూ ఉన్నటువంటి ఫోటోలు మరియు వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఖాళీ సమయంలో టూర్స్ కు వెళ్తూ, డేట్స్ కు వెళ్తూ ఉల్లాసంగా గడపడమే కాకుండా.. వాటన్నిటినీ కూడా తన ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ ఉన్నారు. గత కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ కలిసి ఫారిన్ కంట్రీలకు వెళ్లి స్విమ్మింగ్ పూల్స్ లో రొమాంటిక్ గా గడిపిన సందర్భాలను, ఒకరికి ఒకరు డ్యాన్సులు వేసుకుంటూ గడిపిన సందర్భాలను ఇన్స్టా వేదికగా అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరూ కలిసి మళ్లీ బీచ్ లో చిల్ అవడం , తమకు ఇష్టమైన కారును వాష్ చేస్తూ రొమాంటిక్ గా మారిపోయారు. ప్రస్తుతం వీటికి సంబంధించి వీడియోలు అలాగే ఫోటోలు ఇన్స్టాలో పోస్ట్ చేయగా అవి వెంటనే వైరల్ గా మారాయి. అయితే హార్థిక్ పాండ్యా తన భార్య విడాకులు తీసుకున్న తర్వాత హార్థిక్ పాండ్యా చాలానే బాధకు గురయ్యారు. కానీ ఆ తర్వాత మెల్లిమెల్లిగా కోలుకుని.. టి20 వరల్డ్ కప్ లో అద్భుతంగా రాణించడమే కాకుండా జట్టు విజయానికి కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత బాగోద్వేగానికి గురైన హార్దిక్ పాండ్యా తన జీవితాన్ని మళ్లీ ఫ్రెష్ గా స్టార్ట్ చేశారు. ప్రస్తుతం మోడలింగ్ లో రాణిస్తున్నటువంటి మహికా శర్మతో డేటింగ్ చేస్తూ కాలాన్ని గడుపుతున్నాడు. మరి వీరిద్దరూ భవిష్యత్తులో పెళ్లి చేసుకుంటారా లేదా అనేది మాత్రం ప్రశ్నగా మిగిలిపోయింది.

Read also : మరి ఇంత సన్నగా అయిపోయాడు ఏంటి.. యంగ్ టైగర్ కు ఏమయింది?

Read also : థియేటర్లలో తినుబండారాల ధరల పై సుప్రీంకోర్టు ఆగ్రహం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button