తెలంగాణ

14 న రాష్ట్ర బంద్ కు రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇవ్వాలి : బీసీ నేత

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- తెలంగాణ రాష్ట్రంలో క్షణం క్షణం ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావడం లేదు. బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క బీసీ నాయకులు భగ్గుమంటున్నారు. తాజాగా హైకోర్టు బీసీ రిజర్వేషన్లపై స్టే ఇవ్వడంపై అన్ని బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఈనెల 14వ తేదీన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బందు నిర్వహిస్తున్నట్లు తాజాగా బీసీ నేత, ఎంపీ ఆర్ కృష్ణయ్య మీడియా వేదికగా వివరించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 14వ తేదీన జరిగేటువంటి బంద్ కు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో పాటుగా అన్ని రాజకీయ పార్టీ నాయకులు మద్దతు ఇవ్వాలని కోరారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్లీ హైకోర్టు స్టే ఇవ్వడమేంటి అని.. ఇది చాలా దుర్మార్గమని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 14న మిలియన్ మార్చ్ తరహాలో బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్తామని నిన్న జరిగినటువంటి మీడియా సమావేశంలో బీసీ నేత కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అనుభవజ్ఞులైన న్యాయనిపుణుల అలాగే కొంతమంది అధికారులతో కూడా ఈ విషయాలను ఎప్పటికప్పుడు చర్చిస్తూనే ఉన్నారు. హైకోర్టు ఇచ్చిన స్టే పట్ల గౌరవం ఇస్తూ తదుపరి విచారణ వరకు వెయిట్ చేస్తారా… లేక న్యాయ నిపుణుల సలహా మేరకు సుప్రీంకోర్టుకు వెళ్తారా అనేది ఆసక్తిగా మారింది. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీ నాయకులు కూడా బీసీ రిజర్వేషన్లపై ఆసక్తికరంగా చర్చిస్తున్నారు.

Read also : ఆశలు సమాధి అయ్యాయి…!

Read also : లతీఫ్ ఉల్లా ఖాద్రి ఉర్సు అట్టహాసంగా ప్రారంభం.. గంధం ఎత్తిన నల్లగొండ పోలీసులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button