చండూరు,క్రైమ్ మిర్రర్:-మున్సిపాలిటీల్లో కొత్త పాలకవర్గాలు కొలువు తీరాయి. ఇక కో ఆప్షన్ స్థానాలు భర్తీ కావాల్సి ఉంది. పలువురు ఆశావహులు కో ఆప్షన్ స్థానాన్ని దక్కించుకునేందుకు ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కొత్త కౌన్సిల్ ఏర్పాటయ్యాక 60 రోజుల్లో కోషన్స్ స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. అయితే ఇప్పటికే ఒక నెల రోజులు గడిచిపోయింది. మరో నెల రోజుల్లో స్థానాలను భర్తీ చేయాల్సి ఉంది. కౌన్సిల్ మెజార్టీతో కో ఆప్షన్ స్థానాలను భర్తీ చేస్తారు. కానీ అంతిమ నిర్ణయం అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేతిలోనే ఉంటుంది.
ఆయన నిర్ణయాన్ని కాదని అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్లు సొంత నిర్ణయాలు తీసుకోలేని పరిస్థితులు ఉంటాయి. ఇక చండూరు మున్సిపాలిటీకి సంబంధించి 10మంది కౌన్సిలర్లు ఉండగా నాలుగు కో ఆప్షన్ స్థానాలను కేటాయించారు. మైనార్టీ కి సంబంధించి రెండు స్థానాలు ఉండగా అందులో ఒక మహిళ ఉండాలి అలాగే 2 జనరల్ స్థానాల్లో ఒకటి మహిళ ఉండాలి.గతంలో ప్రజాప్రతినిధిగా చేసి ఉండాలి అనే నిబంధన ఏమీ లేదు. ఏదేమైనా కోప్షన్ స్థానాల భర్తీ ఎమ్మెల్యే చేతుల్లోనే ఉంటుందని చెప్పవచ్చు. చండూరు కు సంబంధించి పలువురు మైనార్టీ నాయకులు ఇతర ముఖ్య నాయకులు కో ప్షన్ స్థానం పైన ఆశలు పెట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. కో ఆప్షన్ అయ్యేందుకు ఎవరు ప్రయత్నాలు వారు చేస్తున్నారు. ఈ కోఆప్షన్ స్థానాలు భర్తీకి సంబంధించి క్రై మిర్రర్ ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించనుంది. మరింత తాజా సమాచారం కోసం ఎప్పటికప్పుడు క్రైమ్ మిర్రర్ కథనాలను ఫాలో అవ్వండి.
Telangana BJP: తెలంగాణ బిజెపిలో అప్పుడే మంత్రి పదవుల పంపకాలు!
