తెలంగాణ

భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలి- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి.

చండూరు, క్రైమ్ మిర్రర్ : ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కై ఏర్పాటు చేయనున్న భవిత కేంద్రాలలో అన్ని సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా, చండూరు మండల కేంద్రంలోని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేయనున్న భవిత కేంద్రం స్థలాన్ని పరిశీలించారు. ప్రస్తుతం జడ్పీహెచ్ఎస్ లో ఉన్న గదిలో భవిత కేంద్రం ఏర్పాటు చేయడానికి నిర్ణయించారు. కాగా గది ముందు భాగంలో ఉన్న వరండా కు సైతం గ్రిల్స్ పెట్టించి గది లా ఏర్పాటు చేయాలన్నారు.

ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు ర్యాంప్, టాయిలెట్స్, రైలింగ్, తాగునీరు వంటి కనీస వసతులు ఏర్పాటు చేయాలని, అంతేకాక వారికి తగ్గట్టుగా కృత్యాధార పద్ధతిలో బోధన ఉండేలా సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రతిరోజు రెండు, మూడు లారీలను ఏర్పాటు చేసి రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ను పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఎలాంటి సమస్యలు లేవని నిర్వాహకులు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. రైతులు నాణ్యతా ప్రమాణాలతో ధాన్యాన్ని కేంద్రాలకు తీసుకురావాలని కోరారు. కలెక్టర్ వెంట చండూరు ఆర్డీఓ శ్రీదేవి, పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్, డీఎస్ఓ వెంకటేశ్వర్లు, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, ఎంఈఓ సుధాకర్ రెడ్డి, మండల స్థాయి ఆధికారులు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button