
క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- మొంథా తుఫాన్ నేపథ్యంలో పార్టీ కీలక నేతలతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. తుఫాన్ ప్రభావం పై నేడు పార్టీ నేతలతో అణువణువు చర్చించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. దాదాపు 25 జిల్లాలలో తుఫాన్ ప్రభావం కారణంగా పంటలు అన్ని దెబ్బతిన్నాయని అన్నారు. కొంతమంది అధికారుల సమాచారం ప్రకారం 15 లక్షల ఎకరాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయని.. 11 లక్షల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది అని… 1.14 లక్షల ఎకరాల్లో పత్తి.. 1.15 లక్షలు ఎకరాల్లో వేరుశనగ.. 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న.. 1.9 లక్షల ఎకరాలలో ఆర్టికల్చర్ పంటలు వంటివి పూర్తిగా దెబ్బ తిన్నాయని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. పార్టీ పరంగా ప్రతి ఒక్క రైతుకు అండగా నిలవాలి అని నాయకులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.
Read also : అయ్యప్ప స్వాములు అలర్ట్.. శబరిమల దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం!
ఇక మన ప్రభుత్వంలో ఆర్బికే వ్యవస్థ ద్వారా అప్రమత్తంగా ఉండి ప్రతి పంటకు ఈ క్రాప్ చేసి… సచివాలయాలు అలాగే ఆర్బికేల సమన్వయంతో గట్టిగా పని చేశామని తెలిపారు. ఉచిత పంట బీమాలతో రైతులకు భరోసా కల్పించి రైతులను ఆదుకునే వాళ్ళం. ప్రస్తుత పరిస్థితులలో ప్రీమియం కట్టినటువంటి రైతులు 19 లక్షల మందికి మాత్రమే బీమా అనేది అందుబాటులో ఉంది. మరి మిగతా రైతుల పరిస్థితి ఎలా అని జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా రైతులకు అండగా ఉండాలని సూచించారు. కేవలం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 16 నెలల్లోనే 16 తుఫానులు వచ్చాయని అన్నారు. నష్టపోయిన రైతులను ఎంతమందిని ఆదుకున్నారో చూస్తే… ఆదుకున్న సంఖ్య సున్నా అని ఆరోపించారు. ఈ కష్టకాలంలో ఏ రైతును కూడా ఆదుకోలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉంది అని అన్నారు. ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర ఇచ్చేటువంటి పరిస్థితులు కనబడడం లేదు అని అన్నారు. మీతో పోల్చుకుంటే మేమే చాలా బెటర్ అని అన్నారు. ఈ నాటి కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది అని అన్నారు.
Read also : అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు : కిషన్ రెడ్డి
 
				 
					
 
						 
						




