
క్రైమ్ మిర్రర్, ఆన్లైన్ డెస్క్ :- తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే తాజాగా గ్రాడ్యుయేట్ మరియు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ కారణంగా మన రాష్ట్రంలోని పల్లి జిల్లాలలో మూడు రోజులపాటు మద్యం, బార్ అండ్ రెస్టారెంట్లు మరియు కల్లు దుకాణాలు నిలిపివేయాలని దుకాణదారులను పోలీసులు ఆదేశించారు. నియమాలను ఉల్లంఘిస్తే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు మద్యం దుకాణ అమ్మకదారులకు హెచ్చరిస్తున్నారు. రేపటినుండి ఈ మధ్యం దుకాణాలు బందు కానున్నాయి అధికారులు వెల్లడించారు. రేపు అనగా 25వ తేదీ సాయంత్రం నాలుగు గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం నాలుగు గంటల వరకు మద్యం షాపులు అనేవి బంద్ కానున్నాయి.
చిన్నారులను మింగేస్తున్న బోరుబావులు-రాజస్థాన్‌లో ఐదేళ్ల చిన్నారి మృతి
ఇక మద్యం దుకాణాలు బందు చేసేటువంటి పలు జిల్లాలను అధికారులు తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోని మెదక్, నిజామాబాద్, ADB, కరీంనగర్, వరంగల్, నల్గొండ మరియు ఖమ్మం జిల్లాలో మద్యం దుకాణాలు నిలిపివేయాలని అన్నారు. వైన్స్, బార్ అండ్ రెస్టారెంట్లు, స్టార్ హోటల్ లోని బార్లు అలాగే ఈ జిల్లాలోని పలుచోట్ల ఉన్న కల్లు దుకాణాలు కూడా మూసివేయాలని హెచ్చరించారు. ఈ జిల్లాలలో ఈ మూడు రోజులు కూడా ఎక్కడా కూడా మద్యం దుకాణం ఓపెన్ చేసినట్లు కనపడకూడదని హెచ్చరించారు. పోలీసులు తెలిపిన ఈ రూల్స్ అతిక్రమిస్తే కచ్చితంగా చటపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. దీంతో ఇప్పటినుండే బార్లకు మందు బాబులు క్యూ కడుతున్నారు.
నిజామాబాద్ జిల్లాలో గ్యాంగ్ రేప్..!
పీఎం కిసాన్ పేరుతో సైబర్ వల…ఏపీకే ఫైల్స్ పంపి అకౌంట్లు ఖాళీ చేస్తున్న కేటుగాళ్లు