జాతీయం

ALERT: GPAY, ఫోన్ పే సేవలు బంద్

ALERT: దేశం మొత్తం వేగంగా డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తిగా డిజిటల్‌ రూపం దాల్చింది.

ALERT: దేశం మొత్తం వేగంగా డిజిటల్‌ ప్రపంచంలోకి అడుగుపెడుతోంది. ముఖ్యంగా బ్యాంకింగ్‌ వ్యవస్థ పూర్తిగా డిజిటల్‌ రూపం దాల్చింది. ఒకప్పుడు బ్యాంక్‌ బ్రాంచ్‌కు వెళ్లాల్సిన పనులు ఇప్పుడు మొబైల్‌ ఫోన్‌లో కొన్ని సెకన్లలోనే పూర్తవుతున్నాయి. ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, యూపీఐ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత నగదు వినియోగం గణనీయంగా తగ్గిపోయింది. చాలా మంది తమ జేబుల్లో డబ్బు పెట్టుకోవడమే మరిచిపోయి, యూపీఐ చెల్లింపులపైనే పూర్తిగా ఆధారపడుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌ బ్యాంకుల్లో ఒకటైన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ కస్టమర్లకు కీలక సమాచారం ఇచ్చింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సంబంధించిన అన్ని డిజిటల్‌ సేవలు కొన్ని గంటల పాటు అందుబాటులో ఉండవని బ్యాంక్‌ స్పష్టం చేసింది. సిస్టమ్‌ మేయింటెనెన్స్‌ పనుల నేపథ్యంలో ఈ సేవల నిలిపివేత జరుగుతుందని తెలిపింది. దీంతో యూపీఐ, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, ఏటీఎం సేవలపై ఆధారపడే కస్టమర్లు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.

బ్యాంక్‌ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఈ నెల 21వ తేదీ అర్ధరాత్రి 2.30 గంటల నుంచి తెల్లవారుజామున 5.30 గంటల వరకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు సంబంధించిన అన్ని సేవలు తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. మొత్తం 3 గంటల పాటు ఈ సేవలు అందుబాటులో ఉండవని బ్యాంక్‌ అధికారికంగా ప్రకటించింది. ఈ సమయంలో యూపీఐ ట్రాన్సాక్షన్లు, నెట్‌ బ్యాంకింగ్‌, కార్డ్‌ లావాదేవీలు, ఇతర డిజిటల్‌ సేవలు పనిచేయవని వెల్లడించింది.

సాధారణంగా ఈ సమయంలో పెద్దగా లావాదేవీలు జరగకపోయినా, అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని బ్యాంక్‌ సూచించింది. ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసే వారు, రాత్రి ప్రయాణాల్లో ఉండే వారు, ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారు, అత్యవసర వైద్య అవసరాల కోసం చెల్లింపులు చేయాల్సిన పరిస్థితుల్లో ఉన్నవారు ముందుగానే కొంత నగదును సిద్ధంగా ఉంచుకోవాలని సూచించింది. డిజిటల్‌ సేవలు పూర్తిగా నిలిచిపోతే ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ఈ సూచనలు చేస్తున్నట్లు బ్యాంక్‌ తెలిపింది.

అయితే ఈ 3 గంటల సమయంలో కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన పేజ్యాప్‌ యాప్‌ ద్వారా కొన్ని చెల్లింపులు చేయవచ్చని బ్యాంక్‌ స్పష్టం చేసింది. పూర్తిగా అన్ని మార్గాలు మూసుకుపోవని, పేజ్యాప్‌ సేవలు మాత్రం అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. అయినప్పటికీ, కస్టమర్లు తమ ముఖ్యమైన లావాదేవీలను ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిదని బ్యాంకింగ్‌ నిపుణులు సూచిస్తున్నారు.

డిజిటల్‌ లావాదేవీలపై పెరుగుతున్న ఆధారపడటం నేపథ్యంలో ఇలాంటి మేయింటెనెన్స్‌ పనులు సహజమేనని, భవిష్యత్తులో మరింత సురక్షితమైన, వేగవంతమైన సేవల కోసం ఈ తాత్కాలిక అంతరాయం అవసరమని బ్యాంక్‌ వర్గాలు చెబుతున్నాయి. కస్టమర్ల భద్రత, డేటా రక్షణ, సేవల నాణ్యతను మెరుగుపరిచే దిశగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ స్పష్టం చేసింది.

ALSO READ: MPTC, ZPTC ఎన్నికలు.. కేటీఆర్, హరీష్‌రావులకు KCR కీలక బాధ్యతలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button