తిరుమల వెళ్లే భక్తులకు ఇది ఒక ముఖ్య గమనిక. ఏడుకొండల పై కొలువై ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి ప్రతిరోజు కూడా దాదాపు కొన్ని లక్షల మంది వెళ్తూ ఉంటారు. అయితే అక్టోబర్ 22వ తారీకు నుండి శ్రీవారి అర్జీతసేవ టికెట్లు విడుదల కానున్నాయి.
2025వ సంవత్సరం లో జనవరి నెలకు గాను శనివారం ఆన్లైన్లో టికెట్లు విడుదల చేశారు. ఇది గమనించి భక్తులందరూ కూడా ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తారు వారు కచ్చితంగా ఈ టికెట్లను వినియోగించుకోవాల్సిందే. భక్తులు ఈ https://ttdevasthanams.ap.gov.in లోకి వెళ్లి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్టోబర్ 24 వ తేదీన జనవరి నెల కు సంబంధించినటువంటి ప్రత్యేక దర్శనాల కోసం 300 రూపాయలు టికెట్లను అందుబాటులోకి తీసుకు వస్తారని అధికారికంగా తెలిపారు.
ప్రస్తుతం టీటీడీ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేడు శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కోటాను విడుదల చేశారు. వీటిలో కొన్నింటిని ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ కింద అక్టోబర్ 21వ తారీఖునే అందుబాటులోకి తీసుకువస్తారు. కాబట్టి పైన ఇచ్చినటువంటి టీటీడీ వెబ్సైట్ ద్వారానే బుకింగ్ చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు. వీటితోపాటుగా తిరుమల తిరుపతి లో జనవరి నెలలో గదుల కోటాని కూడా అక్టోబర్ 24 వ తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకు ఆన్లైన్లో రిలీజ్ చేయనున్నారు. కాబట్టి ఎవరైనా తిరుపతి వెళ్లాలనుకునే వారికి ఈ విషయాన్ని తెలియజేయండి.