
క్రైమ్ మిర్రర్, మహాదేవపూర్:- బీసీ వర్గాలకు చెందిన వ్యక్తులు స్థానిక స్థాయిలో నాయకత్వ బాధ్యతలు చేపట్టినప్పుడు రాజకీయాలలో సామాజిక న్యాయం అనేది సమతుల్యం అవుతుందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అన్నారు. ఆదివారం మహాదేవపూర్ మండలంలో పర్యటించిన పుట్ట మధు మండలంలోని పలు గ్రామాలకు కార్యకర్తలతో సమావేశమై భవిష్యత్తు కార్యచరణ పై సుదీర్ఘ చర్చ జరిపారు. ఇదే క్రమంలో… బీఆర్ఎస్ సూరారం గ్రామ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులుగా ఆకుల శివ (బీసి బిడ్డ..), ఉపాధ్యక్షులుగా రత్న రమేష్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మల్లారపు శంకరి మరియూ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆకుల శివ మాట్లాడుతూ..గ్రామ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలను, లక్ష్యాలను రూపొందించడానికి, గ్రామస్తులతో తరచుగా సమావేశమై వారి సమస్యలను తెలుసుకుని పనితీరులో పారదర్శకత పాటించి, గ్రామస్తులకు జవాబుదారీగా ఉంటూ గ్రామ అభివృద్ధికి కృషి చేస్తారని అన్నారు.





