వైరల్సినిమా

అఖండ-2 ఎఫెక్ట్.. పలు సినిమాలకు భారీ ఎదురుదెబ్బ!

క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్:- తాజాగా అఖండ-2 సినిమాను డిసెంబర్ 12వ తేదీన విడుదల చేస్తున్నామని ఆ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ ప్రకటన చేసింది. ఇక ఇదే సందర్భంలో ఆరోజు రిలీజ్ కావాల్సినటువంటి పలు చిన్న సినిమాలకు భారీ ఎదురు దెబ్బ తగిలింది అనే చెప్పాలి. ఎందుకంటే అఖండ-2 సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఇక ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఒక టాలీవుడ్, బాలీవుడ్ మాత్రమే కాకుండా అనేక భాషల్లో విడుదల కాబోతుంది కాబట్టి డిసెంబర్ 5వ తారీఖున మరే సినిమాలు విడుదలకుండా పలు చిన్న సినిమాలు జాగ్రత్త పడ్డాయి.

Read also : రాత్రి వేళల్లో అధిక మూత్రం వస్తుందా.. అయితే ఈ డేంజర్ సమస్య ఉన్నట్లే?

కానీ ఆ సినిమా అనుకోని కారణాలవల్ల వాయిదా పడడం, మళ్ళీ 12వ తేదీన విడుదల చేస్తున్నామని చెప్పడంతో చిన్న సినిమాలకు గట్టి దెబ్బ తగిలింది. ఇక 12వ తేదీన విడుదల కావాల్సిన హీరో నందు సినిమా”సైక్ సిద్ధార్థ” మూవీని 2026 జనవరి ఫస్ట్ కి పోస్ట్ పోన్ చేశారు. ఇక హెబ్బా పటేల్ మరియు త్రిగుణ నటించినటువంటి హర్రర్ మూవీ “ఈశా” ను కూడా డిసెంబర్ 12వ తేదీ నుంచి డిసెంబర్ 25వ తేదీన క్రిస్మస్ పండుగ రోజున రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. రాజీవ్ కనకాల కొడుకు సినిమా “మౌగ్లీ” కూడా ఇదే రోజున రిలీజ్ కానుంది. ఇక తమిళ స్టార్ హీరో కార్తీ అన్నగారు వస్తున్నారు సినిమా కూడా ఇదే రోజు విడుదలవుతుంది. ఇలా ఎన్నో తెలుగు సినిమాలు ఈనెల 12వ తేదీనే విడుదల కాబోతున్నాయి. ఇకపోతే మరోవైపు క్రిస్మస్ కానుకగా ఈనెల 25వ తేదీన ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు సినీ వర్గాలు పేర్కొన్నాయి. మన టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు డిసెంబర్ 12వ తేదీన విడుదల కావాల్సి ఉండగా అఖండ 2 దెబ్బకు భారీ నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తుండగా తెలివితో మరికొన్ని సినిమాలు పోస్ట్ పోన్ చేసుకున్నాయి. ఇప్పటికీ ఎన్నో చిన్న సినిమా నిర్మాతలు మరియు డైరెక్టర్లు ఆ సినిమాలకు సంబంధించి ఎన్నో రకాలుగా ఈవెంట్లు నిర్వహించారు. కానీ చివరికి అఖండ-2 సినిమా వల్ల భారీగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ.

Read also : తెలంగాణకు IMD అలర్ట్.. మరో రెండు రోజులపాటు తీవ్రమైన చలి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button