జాతీయం

ఢిల్లీలో గాలి కాలుష్యం.. ఈ దుస్థితి రావడానికి కారణాలు ఇవే!

క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- మన దేశ రాజధాని న్యూఢిల్లీలో ప్రస్తుతం గాలి కాలుష్యం ఎంతలా పెరిగిపోయిందో ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఢిల్లీలో గాలి కాలుష్యం భయంకరంగా మారింది. ఈ గాలి కాలుష్యం వల్ల ఢిల్లీలోని ప్రజలందరూ కూడా వివిధ అనారోగ్య కారణాలకు గురయ్యారు. అసలు ఈ గాలి కాలుష్యానికి గల కారణాలు ఎన్నో ఉండవచ్చు. కానీ ఒక దేశ రాజధాని నగరం అంటే చాలా అద్భుతంగా.. అన్ని రకాల వసతులకు కేంద్రంగా.. ప్రతి ఒక్కరు కూడా మెచ్చుకునే విధంగా నగరం అనేది ఉండాలి. కానీ మన దేశ రాజధాని ఢిల్లీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఇక్కడ గాలి కాలుష్యం చాలా ఎక్కువగా ఉంది. మన ఈ క్రైమ్ మిర్రర్ వెబ్సైట్ ద్వారా ఈరోజు ఢిల్లీలో గాలి కాలుష్యం ఎక్కువగా ఉండడానికి కారణాలు ఏంటో తెలుసుకుందాం.

ఢిల్లీలో గాలి కాలుష్యం కు గల కారణాలు:-

1. ఢిల్లీలో మూడు కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీనివల్ల వెలువడే కార్బన్ మోనాక్సైడ్ వల్ల ఢిల్లీలో గాలి కాలుష్యం ఏర్పడింది.
2. ఇండస్ట్రియల్ క్లస్టర్లు మరియు నిర్మాణాలు NCR చుట్టుపక్కల ప్రాంతాలలో ఎక్కువగా ఉండటమే కారణం
3. ఢిల్లీకి ఒకవైపు హిమాలయాలు మరోవైపు ఆరావళి పర్వతాలు ఉండడం వల్ల పొగ వీటిని దాటి బయటకు వెళ్లలేకపోవడం మూడవ కారణం
4. ఢిల్లీ సరిహద్దులోని పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో పంట కాలం ముగిశాక వెంటనే ఆ పంట వ్యర్ధాలను కాల్చి వేయడం నాలుగవ కారణం.
5. ఢిల్లీలో ప్రకృతి మరియు మానవ తప్పిదాలు కారణంగా వాయు కాలుష్యం పెరగడం 5వ కారణం.
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కారణాలు ఢిల్లీ కాలుష్యానికి ఆస్కారంగా మారుతాయి. కాబట్టి ఇకనైనా కేంద్ర అధికారులు ఢిల్లీ కాలుష్యం పై కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప ఢిల్లీలోని ప్రజలు భవిష్యత్తు తరాల్లో ఎన్నో అనారోగ్యాలకు గురవాల్సి వస్తుంది.

Read also : ఐ బొమ్మ రవిది ప్రేమ పెళ్లి.. విచారణలో బయటకు వస్తున్న కీలక విషయాలు!

Read also : ఎన్నిసార్లు చెప్పినా వినలేదు.. చివరికి చనిపోయాడు అంటూ ఏడ్చేసిన గ్రామస్తులు!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button