Homeజాతీయం16 ఇంటర్నేషనల్ విమానాలు నిలిపివేత, ఎందుకంటే?

16 ఇంటర్నేషనల్ విమానాలు నిలిపివేత, ఎందుకంటే?

Air India Flights: అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. మొత్తం 16అంతర్జాతీయ రూట్లలో విమాన సర్వీసులను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెల 21 నుంచి జూలై 15 మధ్య ఈ విమానాల రద్దు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ నెల 12న అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమానం క్రాష్ కావడంతో పలు విమాన సర్వీసులలో అంతరాయం ఏర్పడింది. విమాన ప్రయాణాలకు సంబంధించి షెడ్యూలులో స్థిరత్వాన్ని పునరుద్ధరించి ప్రయాణీకులకు చివరి నిమిషంలో అసౌకర్యాన్ని నివారించే లక్ష్యంతో ఈ చర్యలు చేపట్టినట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది.

పెద్ద విమాన సర్వీసుల తగ్గింపు

అటు ఎయిర్ ఇండియా విమాన సంస్థ పెద్ద విమానాలతో నిర్వహించే సర్వీసులను 15 శాతం తగ్గించనున్నట్లు వెల్లడించింది. పెద్ద విమాన సర్వీసుల తగ్గింపు కూడా జూన్ 21 నుంచి  జూలై 15 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఢిల్లీ-నైరోబి, అమృత్‌ సర్‌-లండన్‌, గోవా-లండన్‌, మధ్య విమాన సర్వీసులు జూలై 15 వరకు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. అటు ఉత్తర అమెరికా, యూరప్‌, ఆస్ట్రేలియా, ఆగ్నేయాసియాలోని ప్రధాన నగరాలను కలిపే 16 అంతర్జాతీయ మార్గాలలో కూడా విమాన సర్వీసులను తగ్గించనున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఒకప్పుడు ఎంతో నమ్మకమైన విమాన సేవలకు కేరాఫ్ గా ఉన్న ఎయిర్ ఇండియా.. పరిస్థితి ఇలా మారడం పట్ల విమాన ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలోనే అన్ని సమస్యల నుంచి బయటపడాలని కోరుకుంటున్నారు.

Read Also: విమాన ప్రమాదంలో కుట్రకోణం.. దర్యాప్తు అధికారుల ఫోకస్!

Anjibabu Chittimalla
Anjibabu Chittimallahttps://crimemirror.com/
గత 16 సంవత్సరాలుగా మీడియా రంగంలో పని చేస్తున్నాను. ABN ఆంధ్రజ్యోతి, టీ-న్యూస్‌, వెలుగు దినపత్రిక, V6 చానెల్ లో జర్నలిస్టుగా పని చేశాను. 2022 నుంచి 2024 వరకు ‘ABP దేశం’కు ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పని చేశాను. BIG TVకి ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా ట్రావెల్, వైరల్, లైఫ్ స్టైల్, టెక్ అండ్ సైన్స్, ఆటో, క్రైమ్ వార్తలు అందించాను. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నాను.

Most Popular

Recent Comments