
Bill Gates On AI: ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగాలు పోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం అవుతున్న నేపథ్యంలో మైక్రోసాఫస్ట్ అధినేత బిల్ గేట్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 100 ఏళ్లు అయినా ప్రోగ్రామర్లను AI భర్తీ చేయలేదన్నారు. కోడింగ్ చేయడంలోనూ మనిషి ఆలోచన అవసరం అన్నారు. ప్రోగ్రామింగ్ రంగంలో AI అనేది అసిస్టెంట్ గా వ్యవహరిస్తుంది తప్ప, పూర్తి ప్రత్యామ్నాయంగా మారబోదన్నారు. ప్రోగ్రామింగ్ అనేది అత్యంత సవాల్ తో కూడుకున్న వ్యవహారం అన్నారు. క్లిష్టతరమైన సమస్యను సృజనాత్మకంగా పరిష్కరించే శక్తి మనిషికి మాత్రమే ఉందన్నారు. దానిని మిషన్లు చేయలేవని తేల్చి చెప్పారు. ప్రోగ్రామింగ్‌కు జడ్జిమెంట్, ఊహాత్మక ఆలోచనా ధోరణి లాంటి లక్షణాలు AIకి ఉండవన్నారు.
కోడింగ్ అనేది ఆలోచనతో కూడుకున్న వ్యవహారం
కోడింగ్ క్రియేషన్ అనేది కేవలం టైపింగ్ కాదన్నారు, ఎంతో లోతుగా ఆలోచించాల్సి ఉంటుందన్నారు బిల్ గేట్స్. మనిషి మేధస్సుకు ఉండే సృజనాత్మకతకు ఏ అల్గారిథమ్ సరిపోదన్నారు. కోడింగ్, ఎనర్జీ మేనేజ్ మెంట్, బయాలజీ రంగాలకు AI ముప్పు తక్కువే అని ఆయన తేల్చి చెప్పారు. సమస్యలను పరిష్కరించే సామర్థ్యం, సృజనాత్మకత, పరిస్థితులకు తగినట్లుగా సామర్థ్యాన్ని మెరుగుపరుచుకునే లక్షణాలు AIకి లేవన్నారు.
కృత్రిమ మేధతో ఉద్యోగాల కోత?
2030 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 8.5 కోట్ల ఉద్యోగాలను AI భర్తీ చేసే అవకాశం ఉందని రీసెంట్ గా వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ అంచనా వేస్తూ ఓ నివేదిక వెల్లడించింది. అదే సమయంలో 9.7 కోట్ల కొత్త ఉద్యోగాలు క్రియేట్ అయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నివేదికపైగా గేట్స్ స్పందించారు. AIతో ఉన్న ముప్పు గురించి తాను కూడా ఆందోళన చెందుతున్నట్లు తెలిపారు. అయితే, AIని తెలివిగా ఉపయోగించుకుంటే ప్రొడక్టివిటీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు.
Read Also: రైతుగా మారి.. అంతరిక్షంలో ఆకుకూరలు పెంచుతున్న శుభాన్షు!