
క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ న్యూస్:- ఉమెన్స్ వరల్డ్ కప్ లో భాగంగా రేపు ఆదివారం భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మహిళల జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. ఈ మ్యాచ్ రేపు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం అవ్వనుంది. ఫైనల్ కు దూసుకు వచ్చినటువంటి రెండు జట్లు కూడా అద్భుతమైన ఫామ్ లో ఉన్నాయి. ఒకవైపు సౌత్ ఆఫ్రికా జట్టు వరుస విజయాలతో ఫైనల్ కు చేరగా… భారత జట్టు కూడా సెమీఫైనల్స్ లో ఆస్ట్రేలియా పై గెలిచి ఫుల్ జోష్ లో ఉంది. అయితే ఇవన్నీ ఇలా ఉండగా రేపు జరగబోయేటువంటి ఫైనల్ మ్యాచ్ లో ఏ జట్టు అయితే గెలుస్తుందో ఆ జట్టుకు భారీ ప్రైజ్ మనీ ఇవ్వాలని బీసీసీఐ భావిస్తున్నట్లుగా క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. గత ఏడాది టీ20 వరల్డ్ కప్ గెలిచినటువంటి పురుషుల జట్టుకు ఏకంగా 125 కోట్ల ప్రైస్ మనీ ప్రకటించారు. ఈ విషయం అప్పట్లో సంచలనంగా మారగా… ఇప్పుడు ఇదేవిధంగా రేపు జరగబోయేటువంటి మ్యాచ్ లో ఎవరైతే గెలుస్తారో వారికి కూడా 125 కోట్ల నజారానా ప్రకటించాలి అనే ఆలోచనలు బిసిసిఐ కి ఉన్నట్లుగా సమాచారం అందింది. రేపు ఫైనల్ మ్యాచ్ లో నవి ముంబై వేదికగా సౌత్ ఆఫ్రికా తో భారత్ తాడోపేడో తేల్చుకొనుంది. మరోవైపు ఐసీసీ కూడా సుమారు 123 కోట్ల ప్రైస్ మనీ ఇవ్వనుంది. దీంతో రేపు గెలిచిన జట్టు ఒక చరిత్ర సృష్టించడంతోపాటుగా భారీగా నగదు ను కూడా గెలుచుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీంతో ఇరు జట్లు కూడా అద్భుతంగా రాణించాలి అని ప్రాక్టీస్ లో మొదలుపెట్టేసారు. ఎవరి బలమెంతో కూడా ప్రతి ఒక్కరూ గమనిస్తూ ముందుకు వెళ్తున్నారు. మరి రేపు జరగబోయేటువంటి ఈ ఫైనల్ మ్యాచ్లో ఏ జట్టు గెలుస్తుంది అనేది కామెంట్ మీ అభిప్రాయం తెలియజేయండి.
Read also : తెలుగుదేశం అనే పార్టీ ఇకపై ఎప్పుడూ ప్రతిపక్షంలో ఉండదు : సీఎం
Read also : అధికారులకు సీఎం సెల్యూట్.. మీ వల్లే ఇది సాధ్యం : సీఎం చంద్రబాబు





