
క్రైమ్ మిర్రర్,స్పోర్ట్స్ న్యూస్ :- ఉమెన్స్ క్రికెట్ వరల్డ్ కప్ చాలా రసవత్తరంగా జరుగుతుంది. పట్టుదల, ఆత్మవిశ్వాసం ఉంటే ఏదైనా సాధించగలమని తాజాగా ఉమెన్స్ వరల్డ్ కప్పులో భాగంగా సౌత్ ఆఫ్రికా ఉమెన్స్ నిరూపించారు. వరల్డ్ కప్ లో భాగంగా సౌత్ ఆఫ్రికా అద్భుతమైన విజయాలతో ఫైనల్ కు చేరింది. నిన్న జరిగినటువంటి సెమిస్ మ్యాచ్లో ఇంగ్లాండ్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య మ్యాచ్ చాలా రసవత్తరంగా సాగింది. మొదట అందరూ కూడా ఇంగ్లాండ్ గెలుస్తుంది అని భావించగా కానీ మ్యాచ్ స్టార్ట్ అయినప్పటి నుంచి మొత్తం కూడా సౌత్ ఆఫ్రికాకే అనుకూలంగా మారిపోయింది. ఇంగ్లాండ్ జట్టు ను 125 రన్స్ తేడాతో ఓడించి సౌత్ ఆఫ్రికా ఫైనల్స్ లో అడుగుపెట్టింది. దీంతో సౌత్ ఆఫ్రికా జుట్టు సరికొత్త రికార్డు సృష్టించిందనే చెప్పవచ్చు. ఎందుకంటే ఉమెన్స్ వరల్డ్ కప్ సీజన్ స్టార్టింగ్ లో ఇదే సౌత్ఆఫ్రికా మరియు ఇంగ్లాండ్ మధ్య మ్యాచ్ జరగగా ఇంగ్లాండ్ సౌత్ ఆఫ్రికా ను ఘోరంగా ఓడించింది. ఆ మ్యాచ్ లో సౌత్ ఆఫ్రికా కేవలం 69 పరుగులకే ఆల్ అవుట్ అవ్వడం.. పది వికెట్ల తేడాతో ఇంగ్లాండ్ ఘన విజయం సాధించడం అంతా కూడా చకా చకా జరిగిపోయాయి. కానీ నిన్న జరిగినటువంటి సెమీస్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు సౌత్ఆఫ్రికా పై ఘోరంగా ఓటిమి పాలయ్యింది. దీంతో నేడు ఆస్ట్రేలియా మరియు ఇంగ్లాండ్ ఉమెన్స్ మధ్య రెండవ సెమీ ఫైనల్ మ్యాచ్ జరుగునుంది. వీరిద్దరిలో ఎవరు గెలిస్తే వారే ఆదివారం జరగబోయేటువంటి ఫైనల్స్ మ్యాచ్లో సౌత్ ఆఫ్రికా తో తలపడునున్నారు.
Read also : విరాళాలలో అయోధ్య రామ మందిరం సరికొత్త రికార్డు!
Read also : తెలంగాణలో పలు గ్రామాలకు రాకపోకలు బంద్





