
క్రైమ్ మిర్రర్, సినిమా న్యూస్ :- ప్రతి ఒక్కరూ ఊహించినట్లుగానే తాజాగా విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన ఒకటయ్యారు. ఇన్నాళ్లు సోషల్ మీడియా వేదికగా వీళ్ళిద్దరి మధ్య ఎన్నో రూమర్స్ వచ్చిన ఎక్కడ కూడా ఇద్దరూ స్పందించలేదు. టూర్స్ కి వెళ్ళినా, షికారులకు వెళ్లిన ఇద్దరూ కలిసి వెళ్లేవారు. ఆ ఫోటోలు ఎలాగోలా సోషల్ మీడియాలో నెటిజన్ల కంట పడ్డాయి. అయితే తాజాగా వీరిద్దరు ఎంగేజ్మెంట్ చేసుకొని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలని షాకింగ్ కు గురి చేశారు. చాలా తక్కువ మంది కుటుంబ సభ్యుల సమక్షంలో హైదరాబాదులోని విజయ్ దేవరకొండ ఇంట్లోనే ఈ ఫంక్షన్ జరిగినట్లుగా సమాచారం అందింది. ఇక వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలలో వీళ్లిద్దరి వివాహం చాలా ఘనంగా జరగబోతుందని తెలుస్తుంది. పట్టణంలోని ఓ ఫేమస్ వెడ్డింగ్ స్పాట్ లో విజయ్ దేవరకొండ మరియు రష్మిక పెళ్లి చేసుకుంటారట. కాగా వీరిద్దరూ కలిసి డియర్ కామ్రేడ్, గీత గోవిందం, కింగ్డమ్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు. చాలా రోజుల నుంచి వీరిద్దరు కూడా లవర్స్ అని… ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని చాలామంది భావించారు. ఈ విషయాలపై చాలా చానల్స్ అలాగే సోషల్ మీడియాలో ఎంతగానో రూమర్స్ వచ్చినా కూడా అసలు స్పందించలేదు. అప్పుడు చెప్పకూడదనుకున్నారో ఏమో కానీ… ఎట్టకేలకు వీరిద్దరి మధ్య ఎంగేజ్మెంట్ అయితే నిజమని ప్రతి ఒక్కరికి చెప్పేశారు. దీంతో ఇకనైనా ఈ రూమర్స్ కి విజయ్ దేవరకొండ, రష్మిక మందన పులిస్టాప్ పెట్టేశారు.
Read also : రాబోయే తెలంగాణ ఎన్నికలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు
Read also : తొలి రోజే ఊహించని కలెక్షన్లు…!