
క్రైమ్ మిర్రర్, తెలంగాణ:- తెలంగాణలో రాజకీయాలు ఎప్పటికప్పుడు తారు మారవుతున్నాయి. కవిత బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెన్షన్ చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీలోని కొంతమంది నాయకుల పై తీవ్రంగా ఆరోపణలు చేస్తుంది. అందులో భాగంగానే హరీష్ రావు పై కూడా కొన్ని కీలక ఆరోపణలు చేసింది. కాలేశ్వరం నుంచి వచ్చినా అవినీతి డబ్బులతో హరీష్ రావు చాలానే కుట్రలు చేశారని కూడా తీవ్ర ఆరోపణలు చేసింది. 2018 ఎలక్షన్ల సమయంలో దాదాపు 20 నుంచి 30 మంది ఎమ్మెల్యేలకు హరీష్ రావు ఫండింగ్ ఇచ్చారు.. ఈ డబ్బంతా కాలేశ్వరం నుంచి వచ్చిన డబ్బులు కావా?.. అని నిలదీశారు. భవిష్యత్తులో ఏమైనా అటు ఇటు జరిగిన తమ దగ్గర ఎమ్మెల్యేలు ఉండాలనే హరీష్ ఆ కుట్రలు చేశారు అని కవిత ఆరోపణలు చేశారు. 2009లో మా అన్న కేటీఆర్ ను ఓడించేందుకు హరీష్ రావు సిరిసిల్లకు ఏకంగా 60 లక్షల రూపాయలు పంపించారు అని కవిత మండిపడింది. కెసిఆర్, కేటీఆర్ వాళ్ళిద్దరితోపాటు నన్ను కూడా ఓడించేందుకు హరీష్ కుట్రలు చేశారని తీవ్ర ఆరోపణలు చేసింది కవిత.
Read also : శిథిలాల కింద మహిళలు, పట్టించుకోని రెస్క్యూ సిబ్బంది!
అయితే ఈ ఆరోపణలు అన్నిటిపై.. యూకే పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వచ్చినటువంటి హరీష్ రావు కవిత ఆరోపణలపై స్పందించారు. 25 ఏళ్ల నా రాజకీయ జీవితం తెరిచిన ఒక పుస్తకం వంటిది అని… రాష్ట్ర సాధనలో అలాగే పార్టీలో నా నిబద్ధత ఏంటి అనేది ప్రతి ఒక్కరికి తెలుసు అని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారని కవితని ఉద్దేశించి అన్నారు. నాపై చేసినటువంటి ఆరోపణలను వారి విజ్ఞతకే వదిలేస్తున్న.. అని విమానాశ్రయంలోనే మీడియాతో స్పష్టం చేశారు.
Read also : భారత్, రష్యాను కోల్పోయాం.. ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు!