
క్రైమ్ మిర్రర్, జాతీయ న్యూస్ :- ఢిల్లీ పేలుడు ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్పందించారు. ఈ పేలుడు ఘటనలో ఎవరైతే సూత్రధారులు మరియు పాత్రధారులు ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలబోమని కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం భూటాన్ పర్యటనలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ.. దేశం పై దాడికి పాల్పడిన వారికి తగిన శాస్తి చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. బాంబు దాడికి పాల్పడిన వారు ఏ మూల కలుగులోకి వెళ్లి దాక్కున్నా కూడా బయటకు తీసుకువచ్చి మరి వారి అంతు చూస్తామని ప్రకటించారు. కాగా గతంలో పహల్గాంలో జరిగిన ఉగ్రవాది దాడుల తర్వాత కూడా నరేంద్ర మోడీ స్పందించిన సమయంలో ఇదేవిధంగా ఫైర్ అయ్యారు. అచ్చం ఆరోజు ఇంగ్లీషులో మాట్లాడి ఉగ్రవాదులకు ఇచ్చిన వార్నింగ్ లాగానే ఈ రోజు కూడా అలానే వార్నింగ్ ఇచ్చారు. ఉగ్రవాదులను హతం చేస్తామని అప్పట్లో నరేంద్ర మోడీ దేశ వ్యాప్తంగా ప్రపంచ దేశాలకు కూడా ఒక వార్నింగ్ మెసేజ్ అనేది పంపారు. దీంతో నిన్న జరిగినటువంటి బాంబు దాడులలో నిందితులు ఎవరు అనేది తెలిస్తే వారిని కచ్చితంగా మట్టుపెట్టే అవకాశం ఉంది. మరోవైపు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ కు పాల్పడిన దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదు అని స్పష్టం చేశారు. నరేంద్ర మోడీ ఒకసారి హెచ్చరికలు జారీ చేశారు అంటే కచ్చితంగా వారిని వదిలిపెట్టరని తెలుస్తుంది. దీనికి ఉదాహరణగా పాకిస్తాన్ జరిపిన ఉగ్రదాడుల తరువాత ఆపరేషన్ సిందూర్ పేరిట భారత జవాన్లు వారికి బుద్ధి చెప్పారు అనేది తీసుకోవచ్చు.
Read also : చివరి ఓటు పడేవరకు అప్రమత్తంగా ఉండాలి-ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి
Read also : కొనసాగుతున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్..గెలుపు ఎవరిదో..?





